Advertisementt

ప్రభాస్, హను.. ఫౌజీ మొదలైంది

Sun 18th Aug 2024 08:45 AM
prabhas,fauzi,hanu  ప్రభాస్, హను.. ఫౌజీ మొదలైంది
Prabhas and Hanu Raghavapudi Film Launched ప్రభాస్, హను.. ఫౌజీ మొదలైంది
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి వరసబెట్టి సినిమాలను చేస్తూనే ఉన్నాడు. రీసెంట్‌గా కల్కి 2898AD సినిమాతో హిస్టరీ క్రియేట్ చేసిన ప్రభాస్.. రాజా సాబ్, సలార్ 2, స్పిరిట్, కల్కి 2898AD పార్ట్ 2 సినిమాలను ఓకే చేసి.. వాటి షూటింగ్స్‌తో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇప్పుడీ లిస్ట్‌లోకి మరో సినిమా యాడైంది. సీతా రామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాకు సైన్ చేసినట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ.. మూవీ యూనిట్ ఈ సినిమాను శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది.

హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లుగా ఇప్పటికే వార్తలు బయటికి వచ్చాయి. అలాగే ఇందులో హీరోయిన్‌గా పాకిస్తాన్ బ్యూటీ ఇమాన్ ఇస్మాయిల్ నటించనుందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. టైటిల్, హీరోయిన్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంకా ఈ సినిమా ఎప్పటి నుంచి సెట్స్‌పైకి వెళుతుందనేది కూడా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా ఓపెనింగ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తిస్థాయి పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా ఉండనుందని, విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారని తెలుస్తుంది. పూర్తి వివరాలను మేకర్స్ మరికాసేపట్లో వెల్లడించనున్నారు.

Prabhas and Hanu Raghavapudi Film Launched:

Prabhas Fauzi Film in Pooja Ceremony

Tags:   PRABHAS, FAUZI, HANU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ