Advertisementt

కల్కి 2898AD ఓటీటీలోకి.. అఫీషియల్

Sat 17th Aug 2024 09:03 PM
kalki 2898ad,ott,release date  కల్కి 2898AD ఓటీటీలోకి.. అఫీషియల్
Kalki 2898AD OTT Release Date Officially Announced కల్కి 2898AD ఓటీటీలోకి.. అఫీషియల్
Advertisement
Ads by CJ

కల్కి 2898AD.. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయిన వారి కోసం, మళ్లీ ఇంకోసారి చూడాలనుకునే వారి కోసం ఓటీటీలోకి వచ్చేస్తుంది. కొన్ని రోజులుగా కల్కి 2898AD ఓటీటీ విడుదలకు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 15 అంటూ ఒకసారి, ఆగస్ట్ 23 అంటూ మరోసారి ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా ఆగస్ట్ 22 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అదే రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ప్రభాస్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా కల్కి 2898AD రికార్డ్‌ని క్రియేట్ చేసింది. అదే స్థాయిలో సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్స్ రాబట్టి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా రెండో పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రెండో పార్ట్‌కు సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉండటం కారణంగా.. పార్ట్ 2 కాస్త డిలే అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

కల్కి 2898AD కథ విషయానికి వస్తే.. మహాభారత యుద్ధం నుంచి మరో ప్రపంచం ఉద్భవించే వరకు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించే కథగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ కథలో పురాణాల డెప్త్ ఉంటుంది. కాబట్టి కథ తెలుసుకునే కంటే.. ఓటీటీలోకి వచ్చాక మరోసారి చూస్తేనే బాగుంటుంది.

Kalki 2898AD OTT Release Date Officially Announced:

Kalki 2898AD OTT Streaming Date Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ