Advertisement

టాలీవుడ్‌కి ఒక్కటంటే ఒక్కటేనా?

Sat 17th Aug 2024 03:15 PM
national film awards,tollywood  టాలీవుడ్‌కి ఒక్కటంటే ఒక్కటేనా?
One One National Award to Tollywood in National Film Awards టాలీవుడ్‌కి ఒక్కటంటే ఒక్కటేనా?
Advertisement

శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో కేవలం ఒక్కటంటే ఒక్క అవార్డు టాలీవుడ్ చిత్రానికి లభించింది. దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్ వెళ్లగా.. అందులో దాదాపు 20 సినిమాలు టాలీవుడ్‌వి ఉన్నాయి. ఈ 20 చిత్రాలలో కేవలం ఒకే ఒక్క చిత్రానికి, అదీ కూడా ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేటగిరీలో అవార్డు రావడం ఏంటో ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న. అంటే 2022లో టాలీవుడ్‌లో కార్తికేయ2 సినిమా ఒక్కటేనా? ఇంకా ఏ చిత్రం, ఏ డిపార్ట్‌మెంట్ వర్క్ జ్యూరీలకు నచ్చలేదా?

మరోవైపు టాలీవుడ్ గురించి ప్రపంచదేశాలు మాట్లాడుకుంటున్నాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమను తలెత్తుకునేలా చేసిన పరిశ్రమలో ప్రస్తుతం టాలీవుడ్ అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇతర పరిశ్రమల నటులు కూడా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తున్నారు. అలాంటిది, ఒకే ఒక్క అవార్డు రావడమంటే, ఇవ్వడమంటే ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు. గత సంవత్సరం ఉత్తమ నటుడు అవార్డుతో పాటు పలు కేటగిరీలలో దాదాపు 9 వరకు అవార్డ్స్ రాగా, ఈసారి మాత్రం టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కటి పరిగణనలోకి తీసుకోవడమంటే.. ఏదైనా వివక్ష జరిగిందని భావించవచ్చా? లేదంటే టాలీవుడ్‌ పేరు టాప్‌లో ఉందని తట్టుకోలేకపోతున్నారా? ఏదేమైనా ఈసారి మాత్రం టాలీవుడ్‌కి అన్యాయం జరిగిందనే చెప్పుకోవాలి. 

ఇక ఈ అవార్డుల నిమిత్తం టాలీవుడ్ నుంచి నామినేషన్‌కు వెళ్లిన చిత్రాలను పరిశీలిస్తే రైటర్ పద్మభూషణ్, సీతారామం, అంటే సుందరానికి, విరాటపర్వం, యశోద, రాధేశ్యామ్, సర్కారు వారి పాట, మర్రిచెట్టు, ఖుదీరాం బోస్, ఇట్లు మారేడిమిల్లి నియోజకవర్గం, కార్తికేయ2, డీజే టిల్లు, ఇక్షు, ధమాకా, చదువే నీ ఆయుధం, బింబిసార, భారత పుత్రుడు, ఎట్ లవ్, అశోకవనంలో అర్జున కళ్యాణం, అల్లూరి వంటి చిత్రాలు టాలీవుడ్ తరపున నామినేషన్‌కు వెళ్లాయి. మరి వీటిలో ఉత్తమ చిత్రాలు పక్కన పెడితే.. ఏ ఇతర డిపార్ట్‌మెంట్ వర్క్.. జ్యూరీకి నచ్చలేదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

One One National Award to Tollywood in National Film Awards:

Only Karthikeya2 got Award in National Film Awards 2024

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement