ఇటీవల మోదీ ప్రమాణ స్వీకారానికి తనయుడు అకీరా నందన్‌తో వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తాజాగా ఇస్రో వేడుకకు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కుమార్తె ఆద్యతో కలిసి కనిపించారు. మోదీతో తన కుమారుడిని చూసి ఎంతగానో ఆనందించిన రేణు దేశాయ్.. ఆ విషయాన్ని ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా తెలియజేసి, తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇదే నేను కోరుకుంటున్నది అంటూ చాలా గొప్పగా ఫీలవుతున్నానని పేర్కొంది. ఇప్పుడు ఆద్య వంతు వచ్చింది.
పవన్ కళ్యాణ్ వెంట ఆద్య ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు. అయితే పవన్ వెంట ఆద్య ఉండటంపై తాజాగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్ మరింత వైరల్ అవుతోంది. ఎందుకు పవన్ కళ్యాణ్ వెంట ఆద్య ఉందో ఆమె వివరణ ఇచ్చారు.
నాన్నతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనడానికి వెళ్లనా? అని ఆద్య నన్ను అడిగింది. తను నన్ను అలా అడగడం చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ల నాన్నతో ఆద్య టైమ్ స్పెండ్ చేయాలని భావిస్తోంది. ఆద్యకు అన్ని తెలియాలి. వాళ్ల నాన్న ఉన్న కీలక పదవి, ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఎంత బిజీగా ఉంటారో అనే విషయాలు తను తెలుసుకోవాలి. అలాగే ఏపీ ప్రజలకు వాళ్ల నాన్న చేస్తున్న సేవలు, ప్రజలు వాళ్ల నాన్నని ఎలా చూస్తున్నారనేది కూడా ఆద్య తెలుసుకుంటుందనే వెళ్లమని చెప్పాను.. అని రేణు దేశాయ్ తన పోస్ట్‌లో పేర్కొంది.