మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ హిందీలో వచ్చిన రైడ్ మూవీకి రీమేక్‌గా మిస్టర్ బచ్చన్‌ని తెరకెక్కించాడు. అయితే ఇది పేరుకే రీమేక్ అని చెప్పాలి. హరీశ్ శంకర్ ప్రమోషన్స్‌లో చెప్పినట్టుగా కథను మార్చేశాడు. గత రాత్రి పెయిడ్ ప్రీమియర్స్‌తోనే మిస్టర్ బచ్చన్ చిత్రం రిజల్ట్ తెలిసిపోయింది.
హరీష్ శంకర్-రవితేజ కాంబో మళ్ళీ హిట్ కొట్టిందో, లేదో అనేది ఈ వీకెండ్ గడిస్తే తేలుతుంది. ఈరోజు ఆగస్ట్ 15న ఆడియన్స్ ముందుకు వచ్చిన మిస్టర్ బచ్చన్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం ఓటీటీ పై ఫ్యామిలీ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ మొదలైంది.
గతంలో అంటే ఒక సినిమా ఏ ఓటీటీలోకి రాబోతోంది అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించే వరకు తెలిసేది కాదు.. కానీ కొన్నాళ్లుగా టైటిల్ కార్డ్స్‌లోనే ఓటీటీ పార్ట్నర్‌ని రివీల్ చేసేస్తున్నారు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ వచ్చే ఓటీటీ కూడా తెలిసిపోయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సంస్థ మిస్టర్ బచ్చన్ ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ డీల్‌తో సొంతం చేసుకుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది అని క్లారిటీ వచ్చేసింది. అది ఎప్పుడు ఏమిటి అనేది మరో అప్‌డేట్ లో..