సమంత మాయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత ఆమె మొహంలో గ్లో కోల్పోయింది. ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండ పక్కన సమంత అక్కలా ఉంది, ఆమె పేస్ ఎక్స్ప్రెషన్ ని చూడలేకపోయామంటూ ప్రేక్షకులు గోల పెట్టారు. ఇక శాకుంతలం లో సమంత లుక్స్ చూసి ఆమె అభిమానులే బేర్ మన్నారు.
ఫిట్ నెస్, ఫిట్ నెస్ అంటూ జిమ్ ల వెంట పరిగెట్టే హీరోయిన్ల మోహంలో కళ కోల్పోవడం అనేది తరచూ చాలామంది హీరోయిన్స్ విషయంలో చూస్తూనే ఉన్నాము. సమంత అటు వర్కౌట్స్, ఇటు మాయోసైటిస్ తో ఆమె మొహం లో కళా-కాంతి రెండు మిస్ అయ్యాయి. ఇప్పుడు నాగ చైతన్య-శోభితల ఎంగేజ్మెంట్ తర్వాత సమంత ప్రతి కదలికని నెటిజెన్స్ డీప్ గా వాచ్ చేస్తున్నారు.
తాజాగా సమంత ఓ పిక్ ని ఇన్స్టా లో షేర్ చేసింది. ఆ పిక్ చూస్తే సమంత ఏంటి ఇంత నిస్తేజంగా డల్ గా కనబడుతుంది అని అనకమానరు. స్పెట్స్ పెట్టుకుని ఎంతగా కవర్ చెయ్యాలని చూసినా సమంత మొహం లో ఆ డల్ నెస్ ఈజీగా తెలిసిపోతుంది. అలా చూడగానే ఏంటి సమంత ఇలా అయిపోయావ్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.