ట్రెడిషనల్ గా కనిపించినప్పుడు ఆచి తూచి సినిమా అవకాశాలు అందుకున్న అనుపమ పరమేశ్వరన్ మోడ్రెన్ అవతారమెత్తాక మాత్రం వరస ఆఫర్స్ తో చేతినిండా సినిమాలతో కళకళలాడుతుంది. టిల్లు స్క్వేర్ అనుపమ పరమేశ్వరన్ జాతకాన్ని మార్చేసింది. ఆ చిత్రంలో లిల్లీ గా అనుపమ కిల్లింగ్ లుక్స్ తో చంపేసింది.
మోడ్రెన్ అంటే మాములు మోడ్రెన్ కాదు అనేలా అనుపమ తన అందాలు చూపించింది. సిద్దు జొన్నలగడ్డ తో రొమాంటిక్ గా రెచ్చిపోయింది. ఈమధ్యన సోషల్ మీడియాలోనూ అనుపమ పరమేశ్వరన్ అందాలు ఆరబోస్తూనే గ్లామర్ లుక్స్ వదులుతూ యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది .
తాజాగా అనుపమ పరమేశ్వరన్ వదిలిన బ్యూటిఫుల్ పిక్స్ చూసి వావ్ అనుపమా ఏ రేంజ్ లో డెవెలెప్ అయ్యావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్. చీర కట్టు అయినా మోడ్రెన్ డ్రెస్ అయినా అందాలు ఎలా చూపించాలో బాగా ఒంటబట్టించుకున్నావ్ అంటూ మాట్లాడుతున్నారు. నిజమే మరి బ్లాక్ అవుట్ ఫిట్ లో అనుపమ కిల్లింగ్ లుక్స్ అదిరిపోయాయనే చెప్పాలి.