బాలకృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు అవడంతో 50 ఇయర్స్ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించ తలపెట్టారు సినీ ప్రముఖులు. సెప్టెంబర్ 1 న జరగబోయే ఈ ఈవెంట్ కి టాలీవుడ్ అతిరథమహారధులు హాజరవుతారని తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య 50 ఇయర్స్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారా అనే సస్పెన్స్ ఎప్పటినుంచో నడుస్తుంది.
తాజాగా సెప్టెంబర్ 1వ తేది నోవాటల్ లో జరగబోవు 50 ఇయర్స్ ఫంక్షన్ కు హీరో చిరంజీవి ని కలసి ఆహ్వానించేందుకు టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. మరి మెగాస్టార్ చిరు బాలయ్య 50 ఇయర్స్ ఫంక్షన్ కు ఖచ్చితంగా హాజరువుతారని నందమూరి అభిమానులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
మెగా-నందమూరి కలయిక కోసం ఇరువురు అభిమానులు ఎప్పటికప్పుడు ఏంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే ఈ ఈవెంట్ లో అయినా వారిద్దరూ కలుస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. ఏపీలో చంద్రబాబు, పవన్ ప్రమాణ స్వీకారం బాలయ్య-చిరు కరచలనం అభిమానులను ఇంప్రెస్స్ చేసింది. మళ్ళి ఇప్పుడు బాలయ్య 50 ఇయర్స్ వేడుకల్లో చిరు అతిథి గా రావడం అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.