కోలీవుడ్ హీరో ధనుష్-సందీప్ కిషన్-అపర్ణ బాలమురళి కలయికలో తెరకెక్కిన రాయన్ మూవీ జూన్ 24 న థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రానికి తమిళనాట హిట్ టాక్ వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం మిక్సడ్ టాక్ ని సొంతం చేసుకుంది. రాయన్ ఫైనల్ రన్ లో 150 కోట్లు కొల్లగొట్టడంతో ధనుష్ రాయన్ చిత్రం హిట్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది.
ప్రస్తుతం థియేటర్ రన్ ముగియడంతో రాయన్ ఓటీటీ రిలీజ్ పై ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తి మొదలయ్యింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ డీల్ తో రాయన్ ఓటీటీ హక్కులు దక్కించుకోగా.. ఇప్పుడు ఈచిత్రాన్ని ఆగష్టు 30 నుంచి స్ట్రీమింగ్ లోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.
అయితే రాయన్ మూవీ మరో ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ నుంచి ఓటీటీ ఆడియన్స్ అందుబాటులోకి రానుంది, తమిళంలో సన్ పిక్చర్స్ రాయన్ మూవీని నిర్మించడంతో సొంత ఓటీటీ అయిన సన్ నెక్స్ట్ నుంచి కూడా రాయన్ ఓటీటీ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఆగష్టు 30 నుంచి రాయన్ చిత్రాన్ని ఓటీటీలో వీక్షించెయ్యొచ్చు.