Advertisementt

డబుల్ ఇస్మార్ట్ ఓవర్సీస్ టాక్

Thu 15th Aug 2024 09:23 AM
double ismart  డబుల్ ఇస్మార్ట్ ఓవర్సీస్ టాక్
Double iSmart Overseas Talk డబుల్ ఇస్మార్ట్ ఓవర్సీస్ టాక్
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్-రామ్ పోతినేని మరోసారి మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఇస్మార్ట్ శంకర్ కి కంటిన్యూగా డబుల్ ఇస్మార్ట్ తో నేడు ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చేసారు. డబుల్ ఇస్మార్ట్ టీజర్, సాంగ్స్, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్ అన్ని సినిమాపై అంచనాలు క్రియేట్ చెయ్యడంతో నేడు విడుదలైన డబుల్ ఇస్మార్ట్ కోసం ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా వేచి చూసారు. 

ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో డబుల్ ఇస్మార్ట్ ప్రీమియర్స్ పూర్తి కావడంతో ఓవర్సీస్ ఆడియన్స్ డబుల్ ఇస్మార్ట్ ని వీక్షించి సినిమా ఎలా ఉందొ అనేది సోషల్ మీడియా ద్వారా తమ స్పందనని తెలియజేస్తున్నారు.  

డబుల్ ఇస్మార్ట్ కూడా ఇస్మార్ట్ శంకర్‌ స్టైల్‌లోనే ఉంది. పూరీ జగన్నాథ్ బాగా తీశాడు. పూరీ కనెక్ట్, రామ్ పోతినేనికి ఇది కమ్ బ్యాక్ మూవీ. హీరో రామ్ ఇచ్చిపడేశాడు. సంజయదత్ యాక్టింగ్ బాగుంది. కామెడీ టైమింగ్, బీజీఎం సినిమాలో ఎక్సలెంట్ అనిపించాయి అంటూ కొంతమంది ఆడియన్స్ చెబుతుంటే.. 

రామ్ పోతినేని ఎంట్రీ సీన్‌ అదిరిపోయింది, అసలు థియేటర్లలో ఈ ఎంట్రీకి ఆడియన్స్ సీట్లలో కూర్చోలేరు. ఫస్టాఫ్ ఏవరేజ్ అంటూ చెబుతున్న ఆడియన్స్ రామ్ పోతినేని ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ అదిరిందంటున్నారు. అయితే సెకండాఫ్ మాత్రం పూరి బాగా హ్యాండిల్ చేశారంటూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రామ్ ఎప్పటిలానే తన డ్యాన్స్‌తో స్క్రీన్స్ ని ఊపేస్తున్నాడంటూ రామ్ అభిమానులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. 

డబుల్ ఇస్మార్ట్ చెత్త మూవీ, ఈ దశాబ్దంలోనే చెత్త మూవీ, రామ్ ఎనేర్జి, కాస్త కామెడీ తప్ప సినిమాలో ఏం లేదు. హీరోయిన్ కావ్య థాపర్ ఏ కోశానా ఆకట్టుకోలేదు. పూరి జగన్నాధ్ డైరెక్షన్ అవుట్ డేటెడ్, ఇస్మార్ట్ శంకర్ కి సాంగ్స్ ప్లస్ అయ్యాయి. ఇక్కడ డబుల్ ఇస్మార్ట్ లో పాటలు ఆకట్టుకోలేదు అంటూ మరికొంతమంది ఆడియన్స్ చెబుతున్నారు. మారి ఫైనల్ రిజల్ట్ ఏమిటనేది కాసేపట్లో తెలిసిపోతుంది. 

Double iSmart Overseas Talk:

Double iSmart Premiers Talk

Tags:   DOUBLE ISMART
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ