మాస్ మహారాజ రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో మూవీ అనగానే అందరికి మిరపకాయ్ గుర్తుకు వచ్చింది. రవితేజ ని ఎనేర్జిటిక్ కేరెక్టర్ లో అండర్ కవర్ పోలీస్ గా మిరపకాయ్ లో రవితేజ ను చూపించిన హరీష్ శంకర్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ లో రవితేజను ఎలా చూపిస్తాడో అని అందరూ ఆసక్తి చూపించారు. హరీష్-రవితేజ మిస్టర్ బచ్చన్ టైటిల్ అనౌన్సమెంట్ నుంచే అందరి చూపు తన సినిమా పైనే ఉండేలా చూసుకోవడంలో హరీష్ శంకర్ వదిలిన ప్రమోషనల్ కంటెంట్ సాక్ష్యం.
అనుకోకుండా అనూహ్యంగా ఆగష్టు 15 బరిలోకి దూసుకొచ్చిన మిస్టర్ బచ్చన్ పాటల్లో హీరోయిన్ భాగ్యశ్రీ అందాలు, ట్రైలర్ లో ఉన్న కంటెంట్ చూసి సినిమా హిట్ అని ఫిక్స్ చాలామంది ఫిక్స్ అయ్యారు. హరీష్ శంకర్-రవితేజ కూడా తమ సినిమాపై అంతే కాన్ఫిడెంట్ గా సినిమా విడుదలకు ఒకరోజు ముందే మీడియా వారికి స్పెషల్ ప్రీమియర్ వేశారు.
మరి సినిమా చూసిన వారు ఆగరు కూడా.. సోషల్ మీడియా X వేదికగా మిస్టర్ బచ్చన్ పై తమ ఒపీనియన్ షేర్ చేస్తున్నారు. హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అవుట్ డేటెడ్ కథతో తెరపైకి తీసుకొచ్చాడు, అసలు ఇంట్రెస్ట్ లేని కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఇరికించారు. హీరోయిన్ భాగ్యశ్రీ ని, ఆమె అందాలు హైలెట్ చేయడంపైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు.
ఎంటర్టైన్మెంట్ అక్కడక్కడా వర్కౌట్ అయ్యింది, మిస్టర్ బచ్చన్ కి అసలైన పాజిటివ్ పాయింట్ సాంగ్స్, విజువల్ గా పాటలు ఆకట్టుకున్నాయి. రవితేజ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా భాగ్యశ్రీ డాన్స్ ఇరగదీసింది. అంతే తప్ప మిస్టర్ బచ్చన్ లో చెప్పుకోవడానికి ప్రత్యేకత ఏమి కనిపించలేదు అంటూ గత రాత్రి మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ చూసిన వారు స్పందిస్తున్నారు.