పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ షూటింగ్ పాల్గొంటున్నారు. రీసెంట్ గానే శంషాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఆతర్వాత ప్రభాస్ సలార్ 2 అలాగే కల్కి 2 పూర్తి చేస్తారనుకుంటే.. ఆయన అనూహ్యంగా హను రాఘవపూడి తో ప్రాజెక్ట్ మొదలపెట్టేందుకు రెడీ అయ్యారు.
ఆగస్టు 17 న పూజా కార్యక్రమాలతో మొదలు కాబోయే ప్రభాస్-హను రాఘవపూడి ప్రాజెక్ట్ ఆ తర్వాత అంటే ఆగష్టు 18 నుంచే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిపోయేలా ప్లాన్ చేసేసారట. ఓ పది రోజుల పాటు ప్రభాస్ హను రాఘవపూడి సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారట. అయితే ప్రభాస్ ఓ సైనికుడిలా కనిపిస్తారని.. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లుగా వార్తలొచ్చాయి.
తాజాగా ప్రభాస్ ఫ్యాన్ ఒకరు ప్రభాస్‌తో మృణాల్ ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హను-ప్రభాస్ ఫౌజి ఫస్ట్ లుక్ అని క్యాప్షన్ పెట్టాడు. ఆ పిక్ పై మృణాల్ ఠాకూర్ స్వయంగా స్పందించింది. మీ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నందుకు సారీ. నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదు అని మృణాల్ చెప్పేసింది.
దానితో అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ ఇద్దరూ డిజ్ పాయింట్ అవుతున్నారు.