మహేష్ ఫ్యామిలీ శ్రీవారి దర్శనం కోసం తిరుమల తిరుపతికి వెళ్లారు. అది కూడా అలిపిరి మెట్ల మార్గం ద్వారా మహేష్ వైఫ్ నమ్రత, పిల్లలు గౌతమ్, సితార లు శ్రీవారి దర్శనం కోసం వెళుతున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రేపు వీఐపీ బ్రేక్ దర్శనంలో మహేష్ భార్య పిల్లలు వేంకటేశ్వరుని దర్శనం కోసం ఈరోజు అలిపిరి మెట్లు ఎక్కుతూ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం నమ్రత, గౌతమ్, సితార లు కలిసి మెట్లు ఎక్కుతున్న వీడియోస్, అలాగే గౌతమ్, సితార లతో ఫోటోలు దిగేందుకు శ్రీవారి భక్తులు ఆసక్తి చూపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.