వేణు స్వామి నాగ చైతన్య జాతకం చెప్పి అడ్డంగా ఇరుక్కున్నాడు. వేణు స్వామి పై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవడం కాదు.. మా అధ్యక్షుడు మంచు విష్ణు తో సహా మూవీ జర్నలిస్ట్ లు వేణు స్వామి పై మహిళా కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వడంతో వేణు స్వామి వైఫ్ వీణ శ్రీవాణి లైన్ లోకి వచ్చింది.
మంచు విష్ణు అన్న ఫోన్ చేసి చాలా పద్దతిగా మాట్లాడారు, ఓ పెద్ద స్టార్ హీరో కొడుకు జాతకం చెప్పడం తప్పైపోయింది, జర్నలిస్ట్ ల్లో ఎంతమంది మంచి వారున్నారు, మీ దగ్గరకు వేణు స్వామి పై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన జర్నలిస్ట్ లను మీరు అడగాల్సిన ప్రశ్న ఏమిటో తెలుసా..
సినిమా అంటే ఎంతోమందికి ఉపాధి కల్పించేది. ఎంతో కష్టపడి సినిమా తీసి విడుదల చేస్తే ఒక్క రివ్యూతో నిర్మాతలను ఎంతగా బాధపెడుతున్నారో అనేది అడగాల్సింది అన్నా.
వందలమంది ని రోడ్ల మీదకి తెచ్చేస్తున్న రివ్యూవర్స్ పై యాక్షన్ తీసుకోరా, అందులో మా జర్నలిస్ట్ లు కూడా ఉన్నారు. వారిని ఏమి అనరా, అంతేకాని ఓ వ్యక్తి పై ఇంతగా రాద్ధాంతం చేసేవారి మీద మీరు యాక్షన్ తీసుకోండి అంటూ వీణ శ్రీవాణి మంచు విష్ణు కి చెప్పుకొచ్చింది.