నిన్న మంగళవారం రాత్రి యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 షూటింగ్ ముగించేసినట్టుగా దేవర సెట్ లో ఉన్న పిక్ తో వేసిన ట్వీట్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంబరపడిపోయారు. ఇక మీద పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అలాగే ప్రమోషన్స్ అంటూ దేవర టీమ్ పరుగులు పెడుతుంది అనుకుంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అంటూ వచ్చిన వార్త అందరిని షాకయ్యేలా చేసింది.
మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ చేతికి దెబ్బతగలడంతో ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్లు ప్రచారం జరుగుతోంది.
దానితో అభిమానులు ఆందోళనపడిపోయారు. ఎన్టీఆర్ యాక్సిడెంట్ వార్తలపై ఎన్టీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. ఆయన జిమ్ చేస్తుండగా ఎడమ చేతికి రెండు రోజుల క్రితం చిన్న గాయం అయ్యింది. అది చాలా చిన్న గాయమే. అందుకే ఆయన దేవర షూటింగ్‌లో మంగళవారం కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయకు పెద్ద ప్రమాదం జరిగినట్టుగా వస్తున్న వార్తలు నమ్మొద్దు, ఆ రూమర్స్ ని అభిమానులు నమ్మకండి అని ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది.