Advertisementt

దువ్వాడ ను డాన్స్ తో పడేసిన మాధురి

Wed 14th Aug 2024 04:07 PM
madhuri  దువ్వాడ ను డాన్స్ తో పడేసిన మాధురి
Duvvada Srinivas gives clarity on his relationship with Madhuri దువ్వాడ ను డాన్స్ తో పడేసిన మాధురి
Advertisement
Ads by CJ

దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి స్టోరీ సినిమా కథ కన్నా ఎక్కువ, రియల్ స్టోరీ కి తక్కువ అన్న చందంగా తయారైంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కి విడాకులివ్వకుండానే గత రెండేళ్లుగా దివ్వెల మధురితో సహజీవనం చెయ్యడం, భార్య వాణి భర్త దువ్వాడ పై న్యాయ పోరాటం చెయ్యడం అన్నిమీడియా ఛానల్స్ లో హైలెట్ అవుతూనే ఉన్నాయి.

అయితే 60 ఏళ్ళ వయసులో దువ్వాడ శ్రీనివాస్ కి దివ్వెల మాధురి కి కనెక్షన్ ఎలా కుదిరిందో అని అందరూ తెగ ఆలోచించేస్తున్నారు. దివ్వెల మాధురి సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్. ఇన్స్టాగ్రామ్ లో దివ్వెల మాధురి రీల్స్ తో తెగ హడావిడి చేస్తుంది. డాన్స్ మాత్రమే అక్కడు ఇంకా చాలా చేసే మాధురి తనని దువ్వాడకు దగ్గర చేసిన విషయం ఏమిటో రివీల్ చేసింది.

తన థాట్స్, శ్రీనివాస్ థాట్స్ ఎక్కడ కలిసాయి అని చెబుతూనే దువ్వాడ శ్రీనివాస్ కు డాన్స్ అంటే ఇష్టం. నాకు ఇష్టం, ఆయనకు పాటలంటే ఇష్టం, నాకు కూడా పాటలంటే ఇష్టం. దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డే కి ఆయన కిష్టమైన డాన్స్ చేశాను. కరిగిపోయాను కర్పూర వీణలా కలిసిపోయాను నీ వంశధారలా అనే సాంగ్ కూడా పాడాను. ఆయన కూడా మంచి సింగర్, పాటలు చాలా బాగా పాడతారు అంటూ మాధురి శ్రీనివాస్ ఇష్టాల గురించి తమకి ఎలా సెట్ అయ్యిందో అనేది రివీల్ చేసింది.

నాకు సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం. హైదరాబాద్ వచ్చి సినిమా రంగంలోకి వెళ్ళాలి అనుకున్నాను. శ్రీనివాస్ కి కూడా యాక్టింగ్ అంటే ఇష్టం. ఆయన్ని పెట్టి నేను సినిమా కూడా తీసాను అంటూ మాధురి శ్రీనివాస్ తో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టింది. 

Duvvada Srinivas gives clarity on his relationship with Madhuri:

Madhuri Clarity About Duvvada Srinivas Relation

Tags:   MADHURI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ