Advertisementt

మన సొమ్మైతే నార్మల్.. మంది సొమ్మైతే స్పెషల్!

Wed 14th Aug 2024 02:23 PM
jagan  మన సొమ్మైతే నార్మల్.. మంది సొమ్మైతే స్పెషల్!
Jagan In Passenger Flight, How Times Changed! మన సొమ్మైతే నార్మల్.. మంది సొమ్మైతే స్పెషల్!
Advertisement
Ads by CJ

అవును.. అధికారంలో ఉన్నన్ని రోజుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా ఉన్నారు..? ఏం చేసారు..? అనేది తెలుగు ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..! నేను చెప్పిందే వేదం.. చేసేదే శాసనం అన్నట్లుగా ప్రవర్తించేవారు..! ఇక తాడేపల్లి ప్యాలెస్ దాటాలంటే చాలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పెషల్ ఫ్లైట్ కావాల్సిందే.. అది 2 కిలోమీటర్ల దూరమా..? పది కిలోమీటర్ల దూరమా..? అవన్నీ అక్కర్లేదు.. ఫ్లైట్ కావాలంతే..! ఇదీ జగన్ ఇన్నాళ్లు ఒరగబెట్టింది..! పోనీ అధికారం పోయిన తర్వాత అయినా మార్పు వచ్చిందా అంటే అబ్బే అస్సలు రాలేదు.. మూడు నెలల పాటు అబ్బో తాడేపల్లి నుంచి బెంగళూరు.. బెంగళూరు నుంచి తాడేపల్లి ఒకటా రెండా పదుల సార్లు ఫ్లైట్ ఎక్కేసారు జగన్..!

నాడు.. నేడు! 

ఇదిగో ఈ ఫోటో ఒకసారి క్లారిటీగా చూడండి..! ఏమనిపిస్తోంది.. ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో ఎక్కడికో జగన్ ఎగిరిపోతున్నారు అన్నట్టుగా అనిపిస్తోంది కదూ.. అలా అనుకుంటే అచ్చు తప్పు..! అక్కడున్నది జగన్.. ఆయన సతీమణి ఆ ఫ్లైట్ స్పెషల్ కానే కాదు.. నార్మల్ మాత్రమే..! ఎందుకంటే ఇప్పుడు జగన్ మారిపోయారట.. తనను తాను సెలబ్రిటీ అనే విషయం మారిపోయి సామాన్యుడిలా ఉండాలని ఇక ప్రత్యేకం అనేది లేకుండా ఏం చేసినా అందరిలాగే సాధారణ మనిషిలా జీవితం గడపాలని ఫిక్స్ అయ్యారట. అంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా అంటే ఇదేనేమో..! చూసారా జగన్ రెడ్డి ఇదే నాడు ఎలా ఉన్నారు..? నేడు ఎలా ఉన్నారనేది ఒక లుక్కేస్తే తెలిసిపోతుంది.

బాబోయ్ గట్టిగానే..!

సెలబ్రిటీ నుంచి సామాన్యుడిగా జగన్ మారిపోయారని వైసీపీ గొప్పలు చెప్పుకుంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు కానీ టీడీపీ, జనసేన శ్రేణులు, నెటిజన్లు మాత్రం గట్టిగానే ఇచ్చిపడేస్తున్నారు. సొంత డబ్బుతో టిక్కెట్ కొనాల్సి వచ్చినప్పుడు సామాన్యుడిలా.. మంది సొమ్ము అయితే స్పెషల్ ఫ్లైట్  ఇదీ జగన్ ఫార్ములా ఇందులో కొత్తగా ఏమీ లేదంటూ సెటైర్లు వేస్తున్నారు జనాలు. మన సొమ్మైతే ECONOMY CLASS 🤦‍♂️.. మంది సొమ్మైతే SPECIAL FLIGHTS 👍 పోలా జగన్ రెడ్డి ప్లానింగ్ అదిరిపోలా అని కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. అంతే కాదండోయ్.. రేపో మాపో టికెట్ లేని ప్రయాణమని ఇంట్లో మహిళలను ఆర్టీసీ బస్సు ఎక్కిస్తారేమో అంటూ నెటిజన్లు మాట్లాడేస్తున్నారు. ముడ్డి కింద 38 కేసులు ఉన్నోడు.. మొన్నటి దాకా ప్రజాధనంతో జల్సాలు చేసి.. మహాత్ముడు లాగా ఎలివేషన్ ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు, వీరాభిమానులు. అయినా.. ఇదంతా కొత్త స్టంట్ ఏమోనని, ఎక్కడో ఎక్కడో కొడుతొందనే అనుమానాలు సైతం వెలిబుచ్చుతున్నారు. ఇదంతా అంతా స్క్రిప్ ప్రకారం చేయట్లేదు కదా..? చేస్తున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఇంకా ఎన్నెన్ని మార్పులు, చేర్పులు జగన్ రెడ్డిలో వస్తాయో వేచి చూడాల్సిందే మరి.

Jagan In Passenger Flight, How Times Changed!:

Jagan Goes From Special Flight To Back Seat

Tags:   JAGAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ