Advertisementt

భర్త వేణు స్వామికి సపోర్ట్ గా భార్య వీణ-శ్రీవాణి

Wed 14th Aug 2024 09:43 AM
venu swamy  భర్త వేణు స్వామికి సపోర్ట్ గా భార్య వీణ-శ్రీవాణి
Wife Veena-Srivani as support for husband Venu Swamy భర్త వేణు స్వామికి సపోర్ట్ గా భార్య వీణ-శ్రీవాణి
Advertisement
Ads by CJ

వేణు స్వామి.. ఈమధ్యన నాగ చైతన్య జాతకం చెప్పి అక్కినేని అభిమానులతోనే కాదు మీడియా వాళ్లతో కూడా బాగా తిట్లు తిన్నాడు. అంతేకాదు మా అసోసిషియన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా వేణు స్వామి విషయంలో సీరియస్ అవడము, మీడియా జర్నలిస్టులు మహిళా కమిషన్ కి వేణు స్వామి జాతకాలపై కంప్లైంట్ ఇవ్వడం అన్ని అందరికి తెలిసిన విషయమే.

అయితే వేణు స్వామి వైఫ్ వీణ-శ్రీవాణి అందరికి పరిచయమున్న పేరే. ఆమె తన భర్త వేణు స్వామి కి అండగా నిలబడుతుంది. అంతా మీడియానే చేసింది, నా భర్త వేణు స్వామి జాతకం చెప్పడం తప్పా.. అదే వారైతే ఏదైనా ఒక విషయాన్ని పదే పదే చూపిసూ ఉచ్ఛం నీచం మారుస్తారు. నేను ఓ జర్నలిస్ట్ నే. అప్పట్లో జర్నలిస్టులు జర్నలిజం పాసైతేనే జర్నలిస్ట్ అయ్యేవారు. ఇప్పుడు ఒకటి రెండు ఇంటర్వ్యూలకే జర్నలిస్ట్ అవతారమెత్తుతున్నారు.

మీడియా వారు సెలబ్రిటీస్ ని ఎంత వేధిస్తున్నారో తెలియదా.. సో కాల్డ్ జర్నలిస్ట్ లు నా భర్త వేణు స్వామి విషయంలో ఏదో జరిగిపోయినట్లుగా మాట్లాడడం విచిత్రం. రాజ్ తరుణ్-లావణ్య కేసు విషయంలో మీడియా ఎలా ప్రవర్తించిందో చూసారుగా. మీడియా వారా మాకు చెప్పేది అన్నట్లుగా వీణ-శ్రీవాణి తన భర్త చెప్పింది తప్పు కాదు అన్నటుగా మాట్లాడింది.

ఓ స్టార్ హీరో కొడుకు జాతకం చెబితే అలా మీద పడిపోతారా.. ఒక్కో ఛానల్ ఒక్కో పార్టీకి కొమ్ము కాస్తారు, మారాల్సింది యూత్ అంతేకాని.. మరేదో కాదు అంటూ వీణ శ్రీవాణి భర్త వేణు స్వామిని వెనకేసుకురావడం నెటిజెన్స్ కి నచ్చడంలేదు. 

Wife Veena-Srivani as support for husband Venu Swamy:

Venu Swamy Wife Ignores Shameless Act

Tags:   VENU SWAMY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ