అవును.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత హుందాగా ప్రవర్తించారు..! దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి గెలిచినట్లు అయ్యింది..! ఇదేంటబ్బా.. హుందా ఏంటి.. గెలుపేంటి..? అనేది అర్థం కావట్లేదు కదా..! అదేనండోయ్.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురించే ఇదంతా టాపిక్. ఎన్నికలు జరగలేదు కదా గెలుపోటములను డిసైడ్ ఎలా చేస్తారనే సందేహం వచ్చింది కదూ.. ఆగండి అక్కడికే వచ్చేస్తున్నా.. ఇంకెందుకు ఆలస్యం అసలు విషయాలన్నీ తెలుసుకుందాం వచ్చేయండి..!
ఎందుకిలా..?
అధికారంలో ఉన్నవారు ఏదైనా చేయాలంటే పెద్ద విషయమేమీ కాదు.. నిమిషాల్లో చేసి పడేయచ్చు కానీ చంద్రబాబు హుందాతనం ప్రదర్శించారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ హైకమాండ్ డిసైడ్ అయ్యింది. టీడీపీ కూటమి పక్షాల బలం అంతంత మాత్రమే ఉండటం.. ఓటర్లుగా ఉన్న జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల్లో 60 శాతానికిపైగా వైసీపీ నుంచి గెలిచిన వారే కావడంతో కూటమి వెనకడుగు వేసింది. పోటీ చేయాల్సిందేనని తెలుగు తమ్ముళ్లు పట్టుబట్టినా ప్రయాస పడాల్సిన అక్కర్లేదని దూరంగా ఉండాల్సిందేనని అధినాయకత్వం చెప్పేసింది. ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం వైసీపీ నుంచి ఓట్లను కొనాల్సిన అక్కర్లేదని.. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అందుకే పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యింది టీడీపీ. కాస్త నిశితంగా పరిశీలిస్తే అధినేత ఒక్క మాట ఊ అంటే చాలు ఓట్లు రావడం పెద్ద విషయమేమీ కాదు.. అయితే చంద్రబాబు ఇక్కడే తెలివిగా ప్రవర్తించి.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుందని నిరూపించుకున్నారు.
ఎగిరెగిరి పడితే..!
పార్టీకి బలం లేదని.. నీతిగా నిజాయితీగానే టీడీపీ తప్పుకుంది. అంతేకానీ.. గట్టి ప్రయత్నాలే చేసుకుంటే ఇదంతా ఆఫ్ట్రల్ అంతే. దీన్నే గెలుపు అనుకుని ఎగిరెగిరి పడితే ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు చెప్పండి. సో.. వైసీపీ తరఫున బరిలోకి దిగిన సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ సక్రమమే అని తేలితే మాత్రం ఎన్నిక ఏకగ్రీవమే అవుతుంది. మొత్తానికి చూస్తే.. బలం లేని చోట బలుపు చూపించకూడదన్న మాట. సరిగ్గా ఇలాంటి పరిస్థితే వైఎస్ జగన్ హయాంలోతాడిపత్రిలో జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో బలం లేకపోవడంతో మిన్నకుండిపోయన జగన్.. గెలిచే పరిస్థితి ఉన్నా.. టీడీపీకి వదిలేశారు.. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. నాడు స్వయంగా ప్రభాకర్ మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సో.. బలం లేకపోతే.. బలవంతుడిని ఢీ కొనడం కష్టమే.. నాడు జగన్ అంతే.. నేడు చంద్రబాబు అంతే.. ఈ మాత్రానికే ఎగిరెగిరి పడాల్సిన అవసరం లేదు..!