Advertisementt

ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారుగా!

Thu 15th Aug 2024 08:12 PM
prabhas fauji  ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారుగా!
Prabhas Fans Too Crazy ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారుగా!
Advertisement
Ads by CJ

కల్కి 2898AD బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముందుగా మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ టార్గెట్‌గా రాజా సాబ్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ సెట్ వేశారు. ప్రస్తుతం అందులోనే రాజా సాబ్ షూటింగ్ చిత్రీకరిస్తున్నారు మారుతి. 

ఈ చిత్రంతో పాటుగా ప్రభాస్ హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్‌ని మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆగ‌స్ట్ 17న హైద‌రాబాద్‌లో ఈ మూవీకి సంబంధించిన‌ పూజా కార్య‌క్ర‌మాలు నిర్వహించనున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఆగస్ట్ 17న పూజా కార్యక్రమాలతో మొదలు కాబోయే ఈ చిత్రం షూటింగ్ ఆగ‌స్ట్ 18 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. 

మూడు వారాల పాటు హను రాఘవపూడి-ప్రభాస్ చిత్ర షూటింగ్ మదురైలో జ‌ర‌గ‌నుంది. ఈ మూడు వారాల షూటింగ్‌ నిమిత్తం ప్ర‌భాస్ 10 రోజుల పాటు డేట్స్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఆగ‌స్ట్ 22 నుంచి ఆయ‌న షూటింగ్‌లో జాయిన్ కానున్నారట‌. ప్రభాస్-హను రాఘవపూడి మూవీకి టైటిల్‌గా ఫౌజీ అనే పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. 

ఈలోపులో ప్రభాస్ ఫ్యాన్స్ ఫౌజీ అంటూ ఓ ఫ్యాన్ మెడ్ పోస్టర్‌ని తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సలార్‌లోని ఓ పిక్ తీసుకుని దానిపై ఫౌజీ టైటిల్ పెట్టి ప్రభాస్ ఇన్ అండ్ యాజ్ అంటూ హడావిడి మొదలు పెట్టగా.. అది చూసిన నెటిజెన్స్ వామ్మో ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.

Prabhas Fans Too Crazy:

Fauji Fan Made Poster Goes Viral

Tags:   PRABHAS FAUJI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ