దేవర బ్యూటీ జాన్వీ కపూర్ నేడు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకుంది. అది కూడా తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా తో కలిసి జాన్వీ కపూర్ శ్రీవారి దర్శనానికి రావడం, అక్కడ మొక్కులు చెల్లించుకోవడం హైలెట్ అయ్యింది. ఈరోజు జాన్వీ కపూర్ తల్లి, అతిలోక సుందరి శ్రీదేవి బర్త్ యానివర్సరీ.
శ్రీదేవి బర్త్ యానివర్సరీ సందర్భంగా జాన్వీ కపూర్ ప్రత్యేకంగా శ్రీవారి దర్శనానికి విచ్చేసింది. తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కుతూ మొక్కులు చెల్లించుకున్న జాన్వీ కపూర్ సాంప్రదాయ పద్దతిలో ఎల్లో శారీలో మెరిసిపోయింది. ఆమె పక్కనే బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా కూడా శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి దర్శనానంతరం గోపురం ముందు జాన్వీ కపూర్, శిఖర్ పహారియాలు శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ కనిపించారు. జాన్వీ-శిఖర్ ఇద్దరిని మీడియా వాళ్ళు వీడియో లు తీస్తూ హడావిడి చేసింది.