అనసూయ భరద్వాజ్ అంటే కాంట్రవర్సీ లేడీ, సోషల్ మీడియా క్వీన్ ఇలా ఆమెకి అనేక పేర్లు పెడతారు చాలామంది నెటిజెన్స్. యాంకర్‌గా ప్రస్థానం స్టార్ట్ చేసి ఈరోజు పాన్ ఇండియా నటిగా స్టేటస్‌ని సొంతం చేసుకున్న అనసూయ భరద్వాజ్.. రీసెంట్ గానే సింబా మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ చిత్ర రిజల్ట్ అనసూయని నిరాశపరిచిందనే చెప్పాలి.
ప్రస్తుతం పుష్ప ద రూల్ లాంటి క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో పాటుగా పలు మూవీస్‌లో నటిస్తున్న అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. క్రేజీ ఫోటో షూట్స్‌తో అనసూయ చెలరేగిపోతుంది. మోడ్రెన్ వేర్, శారీస్ ఇలా ఏ అవుట్ ఫిట్‌లో అయినా అద్భుతంగా ఒదిగిపోతుంది.
తాజాగా అనసూయ శారీ ఫొటోస్ షేర్ చేసింది. మరి చీరకట్టులో కూడా అందాలు ఆరబొయ్యగల సత్తా ఉన్న అనసూయ ఈ చీరలో నిజంగా సో బ్యూటీఫుల్ అని అనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, లూజ్ హెయిర్‌తో అనసూయ చీర కట్టు లుక్ నిజంగా మతి పోగొట్టింది అంటే నమ్మాలి మరి.