టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ నిజంగా అసాధ్యుడే.. లేదంటే ఆయన మెగా కాంపౌండ్‌లోకి నందమూరి హీరోని తీసుకురావడమేమిటి? ఆహా టాక్ షో కోసం బాలయ్యని ఒప్పించడం మాములు విషయం కాదు. పక్కా బిజినెస్ మ్యాన్ అల్లు అరవింద్, అందుకే ఆలోచించి తన టాక్ షో కోసం బాలయ్యని హోస్ట్‌గా పట్టుకొచ్చి ఫుల్‌గా సక్సెస్ అయ్యారు.
ఇక ఇప్పుడు మరో పని చెయ్యబోతున్నారు ఈ సక్సెస్‌ఫుల్ నిర్మాత. అదే బాలయ్య-చిరు కలయిక. వారిద్దరూ బయట అంటీముట్టనట్టుగా ఉంటారు. కానీ ఆహా టాక్ కోసం మెగాస్టార్ చిరంజీవిని-బాలకృష్ణని కలపబోతున్నాడీ మాస్టర్ మైండ్. అంతేకాదు నాగార్జునని అన్ స్టాపబుల్ టాక్ షో కోసం గెస్ట్‌గా తీసుకురావడం వెనుక అల్లు అరవింద్ స్కెచ్ ఉంది.
బాలకృష్ణ-నాగార్జున కలిసి కనిపించే సందర్భాలు చాలా అరుదు. ఈ అరుదైన కలయికలు అన్ స్టాపబుల్ కోసం కలిపితే ఆ ఎపిసోడ్స్ పై హైప్ మాములుగా ఉండదు. అందుకే అల్లు అరవింద్ ఈ షో కోసం కింగ్ నాగ్‌ని, మెగాస్టార్‌ని బాలయ్యతో ఆటాడించడానికి రెడీ అయ్యారు. మరి ఇదంతా చూస్తే అల్లు అరవింద్ అసాధ్యుడే అనిపించకమానదు కదా!