రవితేజ-శ్రీలీల కాంబో అంటే విపరీతమైన క్రేజ్. డల్ అనుకున్న ధమాకా శ్రీలీల డాన్స్‌లు, ఆమె అందానికి కలెక్షన్స్ కుమ్మరించింది. సినిమా కథ మొత్తం రొటీన్ కథే. అందులో కొత్తదనం లేదు, అయినా శ్రీలీలని చూసి ప్రేక్షకులు థియేటర్స్‌కి కదిలారు. ఇప్పుడు ఇదే కాంబో మరోసారి రిపీట్ అవుతుంది అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉండాలి.
ప్రస్తుతం మిస్టర్ బచ్చన్‌తో మరో రెండు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న రవితేజ వెంటనే తన 75వ సినిమా సెట్స్‌లోకి వెళ్లనున్నారు. భాను భోగవరపు డైరెక్షన్‌లో రవితేజ-శ్రీలీల జోడి మరోసారి కలిసి కనిపించనుంది. ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కోహినూర్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట మేకర్స్. లక్ష్మణ్ భేరి కేరెక్టర్‌లో రవితేజని పవర్ ఫుల్‌గా చూపించనున్నాడట దర్శకుడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసేందుకు ఇప్పటి నుంచే మేకర్స్ సన్నద్ధం అవుతున్నారని తెలుస్తోంది.