Advertisementt

లావణ్య మాజీ లవర్ మస్తాన్ సాయి అరెస్ట్

Mon 12th Aug 2024 08:52 PM
mastan sai  లావణ్య మాజీ లవర్ మస్తాన్ సాయి అరెస్ట్
Twist In Raj Tarun Case: Lavanya Ex Arrested లావణ్య మాజీ లవర్ మస్తాన్ సాయి అరెస్ట్
Advertisement
Ads by CJ

హీరో రాజ్ తరుణ్ ఆయన మాజీ ప్రియురాలు లావణ్య విషయంలో మస్తాన్ సాయి అనేవాడు ప్రముఖ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మస్తాన్ సాయి తో కలిసి లావణ్య తనని మోసం చేసింది.. అందుకే ఆమెతో నేను విడిగా ఉంటున్నాను అని రాజ్ తరుణ్ చెబుతుంటే.. నా మొగుడు నాకు కావాలి, రాజ్ తరుణ్ మరో హీరోయిన్ తో కలిసి తిరుగుతూ తనని మోసం చేశాడంటూ లావణ్య పోరాడుతుంది. 

లావణ్య డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది అందుకే ఆమెని వదిలేసాను అని రాజ్ తరుణ్ అంటే.. నేను అన్యాయంగా కేసులో ఇరికించబడ్డాను అంటూ లావణ్య వాదిస్తుంది. మధ్యలో మస్తాన్ సాయి అనేవాడు లావణ్యకు క్లోజ్ అయ్యాడంటూ రాజ్ తరుణ్ ఆరోపించడం, అంతేకాదు మస్తాన్ సాయి అనేవాడు డ్రగ్స్ కేసులో పోలీస్ ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందుతుడు. 

లావణ్య-రాజ్ తరుణ్ వ్యవహారం నలుగుతున్న సమయంలో మస్తాన్ సాయి లావణ్య మాట్లాడుకున్న ఫోన్ రికార్డ్స్ లీకై సెన్సేషన్ సృష్టించాయి. గతంలో లావణ్య మస్తాన్ సాయి పై కేసు పెట్టి వాపస్ తీసుకుని.. ఇప్పుడు అతనితోనే ఫ్రెండ్ షిప్ చేస్తుంది. అదే ఆమెపై అభియోగం అయితే పోలీసులు నుంచి తప్పించుకుని తిరుగుతున్న మస్తాన్ సాయి ని నేడు పోలీసులు అరెస్ట్ చేసారు. 

జూన్ లో మస్తాన్ సాయి విజయవాడలో డ్రగ్స్ తో అడ్డంగా పట్టుబడినప్పటికి అపుడు పోలీసు ల నుంచి అనూహ్యంగా తప్పించుకోగా.. ఇప్పుడు పోలిసుల చేతికి చిక్కాడు. ఇదే మస్తాన్ సాయి హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ వయ్వహారంలో లావణ్య తో పాటుగా నిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.  

Twist In Raj Tarun Case: Lavanya Ex Arrested:

Mastan Sai Arrested in Drugs Cas

Tags:   MASTAN SAI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ