Advertisementt

వేణు స్వామి పై మా అధ్యక్షడు విష్ణు ఫైర్

Mon 12th Aug 2024 05:59 PM
vishnu  వేణు స్వామి పై మా అధ్యక్షడు విష్ణు ఫైర్
Vishnu Fire is our president on Venu Swamy వేణు స్వామి పై మా అధ్యక్షడు విష్ణు ఫైర్
Advertisement
Ads by CJ

సెలెబ్రిటీ జాతకాల పేరుతో ఫేమస్ అయ్యి నోటికొచ్చిన జాతకాలు చెప్పే వేణు స్వామి పై మా అధ్యక్షుడు మంచు విష్ణు ఫైర్ అయ్యారు. రీసెంట్ గా వేణు స్వామి సెలెబ్రిటీ, రాజకీయనేతలు జాతకాల జోలికి వెళ్లనూ అంటూనే హీరో నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల కు సంబందించిన జాతకాన్ని పబ్లిక్ గా చెప్పడం అనేది సెన్సేషన్ అయ్యింది. 

వేణు స్వామి నాగ చైతన్య జాతకంపై చేసిన కామెంట్స్ కి అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు..తెలుగు మీడియా ప్రతినిధులు కూడా వేణు స్వామిపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసారు.  మా అధ్యక్షుడు మంచు విష్ణు వేణు స్వామి కి ఫోన్ చేసి ఫైర్ అవడమే కాకుండా.. సెలెబ్రిటీ జాతకాలు అంటూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదు, మీ మీద చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు వేణు స్వామి కి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.  

జాతకాల పేరు తో ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు.. ఈ విషయంలో సహించేది లేదు అని మంచు విష్ణు వేణు స్వామి విషయంలో ఫైర్ అవటం వల్ల.. అందుకే వేణు స్వామి హడావిడిగా నేను గతంలో నాగ చైతన్య-సమంత జాతకం చెప్పాను, దానికి పొడిగింపుగా చైతు-శోభితల జాతకం చెప్పాను, ఇక మీద సెలెబ్రిటీ జాతకాల జోలికి వెళ్ళను, మంచు విష్ణు ఫోన్ చేసారు, ఆయన రాగానే వెళ్లి కలుస్తాను అంటూ రీసెంట్ గా వీడియో వదిలిన విషయం తెలిసిందే. 

Vishnu Fire is our president on Venu Swamy:

Maa president Manchu Vishnu warns Venu Swamy

Tags:   VISHNU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ