యాంకర్ కమ్ నటి అనసూయ 40 పదుల వయసులోనూ అందాలు చూపించే విషయంలో మాత్రం అస్సలు మొహమాట పడదు. తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా తన డ్రెస్సింగ్ స్టయిల్ విషయంలో వెనక్కి తగ్గదు. తన కొడుక్కి తన డ్రెస్సింగ్ స్టయిల్ నచ్చదు అంటూనే కొడుకు ముందే మినీ డ్రెస్ వేసుకుని తిరుగుతుంది. ఆ విషయంలో అనసూయ డేరింగ్ అండ్ డాషింగ్ అనే చెప్పాలి.
కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్ షో కి అనసూయ వేసే గ్లామర్ డ్రెస్ లు చూస్తే మతి పోవాల్సిందే. శని, ఆది వారాల్లో స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం లో కంటెస్టెంట్స్ కన్నా ఎక్కువగా అందాల ఆరబోత జెడ్జ్ అనసూయదే. శేఖర్ మాస్టర్ తో కలిసి స్టేజ్ పై రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా అనసూయ గత రాత్రి కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్ షో లో వేసిన కాస్ట్యూమ్స్ తో ఉన్న ఫోటో షూట్ షేర్ చేసింది.
లైట్ మోడ్రెన్ డ్రెస్ లో అనసూయ కత్తిలాంటి ఫోజులతో కిల్లింగ్ లుక్స్ తో చంపేసింది. అనసూయ 40 ప్లస్ అంటే ఎవరూ నమ్మరు. అంతలాంటి అందాన్ని అనసూయ మైంటైన్ చేస్తుంది. జిమ్ లో వర్కౌట్స్ గట్రా రెగ్యులర్ గా చేస్తుంది. అయితే కొద్దిరోజులుగా అనసూయ కాస్త బరువు పెరిగినట్టుగా కనబడుతుంది. కానీ ఆమె హైట్ అది కనిపించకుండా కవర్ చేసేస్తుంది.