కొడాలి నాని కూటమి ప్రభుత్వ కేసులకు భయపడి రాజకీయ సన్యాసం తీసుకుంటారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో ఇష్టమొచ్చినట్లుగా చెలరేగిపోయి బూతు మంత్రిగా పేరు గాంచిన గుడివాడ మాజీ ఎమ్యెల్యే కొడాలి నాని ని ఊపిరి తీసుకోవడానికి కూడా వీలులేకుండా కేసులు సిద్ధం చేస్తున్నారట టీడీపీ నేతలు.
అందుకే కొడాలి నాని ఈ వ్యవహారం పై అంటే కేసుల విషయంలో బయపడి రాజకీయాలకు దూరంగా ఉంటాలనే నిర్ణయం తీసుకున్నాడని అంటున్నా.. కూటమి ప్రభుత్వం కొడాలి నాని నేరాలను లెక్కగట్టి నిన్ను వదిలేదెలే అంటూ పలు వివాదాల్లో కేసులు పెట్టి లోపలకి పంపే స్కెచ్ వేసినట్లుగా తెలుస్తుంది.
టీడీపీ నేతలు, పార్టీ ఆఫీస్ లపై గతంలో వైసీపీ నేతలు చేసిన దాడుల కేసులు పోలీసులు వెలికితీస్తున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కొడాలి నాని అనుచరులైన వైసీపీ నేతలు పలుమార్లు బెదిరించారు. గతంలో అంటే 2022 డిసెంబరు లో ప్రతిపక్ష పార్టీ అయినా టీడీపీ ఆఫీస్ లో ఉన్న రావి, ఇతరనేతలపై కత్తులు, కర్రలు, ఇనుపరాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడులకు పాల్పడ్డారు, ఈ ఘటనలో వైసీపీ నేతలకు సీఐ గోవిందరాజులు కొమ్ముకాసి టీడీపీ కార్యకర్తలని భయపెట్టినట్లుగా, వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేసినట్లుగా తెలుస్తుంది.
అంతేకాకుండా గుడివాడ కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. అప్పట్లో గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీపైనా వైసీపీ నేతలు దాడులకు పాల్లడ్డారు. కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనల్లో అప్పటి పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడవన్నీ వెలికితీసి పోలీసులు కొడాలి నాని, ఇంకా ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.