స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ప్రతి ఏడాది ఈటీవీలో ఫేమస్ కామెడీ షో జబర్దస్త్ నుంచి ఎవరో ఒకరు అడుగుపెట్టి తమ కామెడీ తో పాటుగా మిగతా టాలెంట్ ని బుల్లితెర ప్రేక్షకులకు చూపిస్తున్నారు. గతంలో ముక్కు అవినాష్, చలాకి చంటి, ఫైమా లాంటి వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్లి అక్కడ కూడా ఫేమస్ అయ్యారు.
దానితో బిగ్ బాస్ సీజన్ 8లోకి ఏ జబర్దస్త్ కంటెస్టెంట్ అడుగుపెడతాడా అని బుల్లితెర ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ కి వచ్చే కంటెస్టెంట్స్ లో జబర్దస్త్ మాజీ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గతంలో జబర్దస్త్ లో కామెడీ చేసి ఆ తర్వాత యూటుబర్ గా మారి యూట్యూబ్ లో బిగ్ బాస్ రివ్యూ చెబుతున్న జబర్దస్త్ మహిధర్ ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్లే జబర్దస్త్ కమెడియన్స్ వీరే, తనకు సమాచారం ఉంది అంటున్నాడు.
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో కొంతమంది పేర్లను రిలీజ్ చేశాడు మహిధర్. ఆ లిస్ట్ ప్రకారం బుల్లితెర నుంచి జబర్దస్త్ నరేశ్, యాదమ్మ రాజు, కిరాక్ ఆర్పీ, బంచిక్ బబ్లూ ఈసారి బిగ్ బాస్ 8 హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది.