నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల డేటింగ్ రూమార్స్ కి ఎంగేజ్మెంట్ తో ఫుల్ స్టాప్ పెట్టిందీ జంట. రీసెంట్ గా నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల నిశ్చితార్ధం అక్కినేని-దూళిపాళ్ల కుటుంబాల నడుమ సింపుల్ గా జరిపించేసినా ఆ ఫొటోస్ మాత్రం నెట్టింట సంచలనం సృష్టించాయి. కొడుకు ఎంగేజ్మెంట్ ని కింగ్ నాగార్జున స్వయంగా ప్రకటించారు. అంతేకాదు నా పెద్ద కొడుకు సంతోషంగా ఉన్నాడని చెప్పారు.
నాగ చైతన్య సమంత తో విడాకుల తర్వాత డిప్రెషన్ లకి వెళ్ళాడు, నరకం అనుభవించాడు అంటూ నాగార్జున గతంలో చైతు పరిస్థితిని వివరించారు. తాజాగా ఆయన ఓ ఛానల్ తో మట్లాడుతూ.. ఇప్పుడే నాగ చైతన్య సంతోషంగా ఉన్నాడు. శోభితాని నిచ్చితార్ధం చేసుకున్నాడు. గత రెండేళ్ళుగా వారు ప్రేమలో ఉన్నారు, ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు.
అయితే వీరిద్దరి పెళ్లికి తొందర లేదు, ఇప్పుడే నిశ్చితార్ధం అయ్యింది.పెళ్లి అక్టోబర్ కానీ నవంబర్ లో కానీ ఉండొచ్చు, అంటే రెండు నెలల తర్వాతే చైతు-శోభితల వివాహం ఉంటుంది అంటూ నాగార్జున కొడుకు పెళ్లెప్పుడో క్లారిటీ ఇచ్చారు