Advertisement
TDP Ads

రేవంత్.. కేటీఆర్ అంటే అట్లుంటది!

Sun 11th Aug 2024 04:25 PM
revanth reddy  రేవంత్.. కేటీఆర్ అంటే అట్లుంటది!
Revanth..KTR is like that! రేవంత్.. కేటీఆర్ అంటే అట్లుంటది!
Advertisement

రేవంత్.. ఇదీ కేటీఆర్ రేంజ్!

అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ రేంజి ఏంటి అనేది బాగా తెలిసొచ్చింది..! మనం ఇంత మంది రాత్రింబవళ్లు నెత్తి నోరు కొట్టుకుంటున్నా వర్కవుట్ అవ్వట్లేదే..? వామ్మో ఇవన్నీ కేటీఆర్ ఒక్కడి వల్లే ఎలా సాధ్యమైంది..! ఎంతైనా ఆయన గ్రేటేనబ్బా..! ఇవీ విదేశీ పర్యటనలో మంత్రులతో ముఖ్యమంత్రి అన్న మాటలట..! ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ.. విదేశాల వరకూ పాకుతున్న మాటలు ఇవే..! అవునా.. ఇంతకీ ఏం జరిగింది..? కేటీఆర్ కథేంటి..? రేవంత్‌కు తెలిసిన ఆ రేంజ్ మ్యాటర్ ఏంటి..? అనే ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!

ఇదీ అసలు కథ..!

ఐటీ మినిస్టర్‌గా ఉన్నప్పుడు కేటీఆర్ రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలు, పెట్టుబడుల గురించి ఇప్పుడు కాదు రేపొద్దున్న జనరేషన్ కూడా చెప్పుకునేలా ఉంటాయ్.. అన్నది బీఆర్ఎస్ చెప్పుకుంటోంది..! ఎందుకంటే.. ఒకటి కాదు రెండు కాదు పదేళ్లపాటు ఐటీ శాఖకు మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్.. చిన్నపాటి కంపెనీల నుంచి పేరుగాంచిన బడా కంపెనీలు సైతం వచ్చాయన్నది గులాబీ పార్టీ చెబుతున్న మాటలు. ఈ మధ్యనే కేటీఆర్ కూడా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని.. ప్రైవేట్ రంగంలో 24 లక్షలమందికి పైగా ఉద్యోగాలు లభించాయన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు.. TS-IPASS వంటి వినూత్న విధానాలతో తాము తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మార్చామని కూడా కుండ బద్ధలు కొట్టి మరీ చెప్పారు. భౌతిక, సామాజిక వనరులు సమకూర్చడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పనతో తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించామని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఐటీ శాఖ వన్నె తెచ్చిన వ్యక్తి అంటే టక్కున గుర్తొచ్చేది కేటీఆరే.. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకూ ఎందరో ఐటీకి మంత్రిగా పనిచేసినప్పటికీ ఈయన రేంజ్ వేరు. ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయన గుర్తుండిపోతారంతే..!

ఇదీ కేటీఆర్ అంటే..!

కేటీఆర్ హయాంలో ఏయే కంపెనీలు వచ్చాయన్నది గూగుల్ సెర్చ్‌ చేసినా చాలు లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది..! పైగా విదేశాలకు ఎప్పుడు వెళ్లాల్సి వచ్చినా సెక్రటరీలతో ఒక్కడే వెళ్లేవారు..! ఏనాడు ఈ విషయంలో కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు. అయినప్పటికీ ఎక్కడా ఏ లోటు లేకుండా ఐటీ శాఖను చూసుకుంటూ రావాల్సినవి వచ్చేలా చేసుకుంటా వచ్చారు. కానీ.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మొదలుకుని మంత్రులు విదేశాలన్నీ తిరిగేస్తున్నా పరిస్థితులు అంతంత మాత్రమే అనుకూలిస్తున్నాయన్నది కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు చెబుతున్న మాట. అయినా కేటీఆర్ ఒక్కడి వల్లే ఇదెలా సాధ్యమైంది..? మనం కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నా ఆశించినంతగా వర్కవుట్ కావట్లేదే..? అని డీలాగా మంత్రులతో రేవంత్ అన్నారట. ఏ మాటకు ఆ మాట.. కేటీఆర్ రేంజే వేరబ్బా అని కూడా అనేశారట. ఇందుకు కారణం టాప్ మోస్ట్ కంపెనీల పెద్దలతో సంప్రదింపులకు పోయినప్పుడు తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్న రేవంత్‌ను.. వేర్ ఈజ్ కేటీఆర్..? ఆయన ఎప్పుడొస్తారు..? అనే ప్రశ్నలు వచ్చాయంటే సీన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంటే.. ప్రభుత్వం పోయినా కేటీఆర్‌ తెలుగు రాష్ట్రాల్లో కాదు విదేశాల్లో పేరు మాత్రం పోలేదు.. ఇది ఇదీ సార్ కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్ అంటూ గులాబీ నేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు.

పరువు నిలబెట్టుకోవాలని..!

ఎలాగైనా సరే పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి తీసుకెళ్లాలన్నది రేవంత్ రెడ్డి టార్గెట్ అట. ప్రతిపక్షాలు, విమర్శకుల నోరు మూయించాలన్నా.. పరువు నిలుపుకోవాలన్నా ఏదో ఒకటి చేసి పెట్టుబడులు పెట్టించాలన్నది పదే పదే పర్యటనలో మంత్రులకు ఆయన గుర్తు చేస్తున్నారట. అంతేకాదు.. ఈ దెబ్బతో కేటీఆర్ పేరు అస్సలు వినిపించకుండా చేయాలనే ప్రయత్నాలు సైతం గట్టిగానే జరుగుతున్నాయట. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు, భారత్‌లో అడుగుపెట్టని, పైసా కూడా పెట్టుబడులు పెట్టని సంస్థలను సైతం హైదరాబాద్‌కు పట్టుకుని రావాల్సిందేనని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యారట. అంటే.. కేటీఆర్ పేరు చెరిపేయాల్సిందన్నదే బహుశా కాంగ్రెస్ టార్గెట్ అనుకోవచ్చు. అందుకే.. సీఎం, మంత్రులు చెబుతుంటే ప్రజలు నమ్మట్లేదనో లేకుంటే.. మరోలాగా అర్థం చేసుకుంటారనో అధికారులు జేఎస్ రంజన్‌ లాంటి వారితో ఇదిగో ఫలానా కంపెనీలు వస్తున్నాయని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే.. కేసీఆర్ బ్రాండ్ తెలంగాణ రాజకీయాల్లో, కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్ విదేశాల్లో పూర్తిగా తుడిచేయాలన్నదే కాంగ్రెస్ టార్గెట్ అన్న మాట.

అంతా మా కష్టమే..!

ఇదిలా ఉంటే..  పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తాము ఇతర దేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీ ప్రతినిధులతో పెంచుకున్న సంబంధాలే నేడు రాష్ట్రానికి మేలు చేకూరుస్తున్నాయని కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. విరామం లేకుండా పట్టుదలతో రాష్ట్రానికి భారీ ఎత్తున వీదేశీ పెట్టుబడులు తీసుకొచ్చామని, వాటిని చూసి ఇవాళ మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రానుండటం సంతోషకరమని అన్నారు. అయినా నాడు కేటీఆర్‌తో ఏ టీమ్ అయితే ఐటీ, విదేశీ పర్యటలో రేవంత్ కూడా అదే టీమ్‌తోనే కంపెనీలను సంప్రదిస్తున్నారు. ఇది ఎంతవరకూ వర్కవుట్ అవుతుంది..? కేటీఆర్ సాధించినదేంటి..? రేవంత్ రెడ్డి అండ్ కో అమెరికా, దక్షిణ కోరియాలో సాధించబోయేదేంటి..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Revanth..KTR is like that!:

KTR vs Revanth Reddy

Tags:   REVANTH REDDY
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement