సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో డబుల్ ఇస్మార్ట్ పై అంచనాలు పెంచేసిన రామ్ - పూరి జగన్నాధ్ లు ఆగష్టు 15 న చాలా కాన్ఫిడెంట్ తో బరిలోకి దిగుతున్నారు. అయితే ఈమద్యలో డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15 నుంచి పోస్ట్ పోన్ అవ్వబోతుంది అనే రూమర్స్ బయటికి వచ్చాయి. మరోపక్క పూరి జగన్నాధ్ గత చిత్రం లైగర్ డిసాస్టర్ ఎఫెక్ట్ డబుల్ ఇస్మార్ట్ పై పడింది ఎలా తట్టుకుంటారో అనుకున్నారు.
లైగర్ నష్టాలు చెల్లించకపోతే నైజాం ఏరియా లో డబుల్ ఇస్మార్ట్ విడుదల కాకుండా అడ్డంకులు సృష్టించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ రెడీ అయ్యారు. దానితో డబుల్ ఇస్మార్ట్ విడుదలపై అనుమానాలు మొదలయ్యాయి. గత వారం రోజులుగా లైగర్ పంచాయితీ నడుస్తుంది. లైగర్ విషయం తేలితే కానీ.. డబుల్ ఇస్మార్ట్ విడుదలకు రూట్ క్లియర్ అవ్వదు.
తాజాగా డబుల్ ఇస్మార్ట్ సినిమాకు లైగర్ కష్టాలు తీరినట్టే అంటున్నారు. లైగర్ తో నష్టపోయిన బయ్యర్లకు నలభై శాతం నష్టాలు భర్తీ చేయడానికి సెటిల్మెంట్ చెయ్యడంతో పూరి జగన్నాధ్ పై ప్రెజర్ తగ్గింది. దానితో డబుల్ ఇస్మార్ట్ విడుదలకు ఉన్న అడ్డంకులు ఆల్మోస్ట్ తొలిగిపోయాయి. సో ఆగష్టు 15 న డబుల్ ఇస్మార్ట్ థియేటర్స్ లో మాస్ పూనకాలు తెప్పించడానికి రెడీ..!