సూపర్ స్టార్ మహేష్ బాబు గత వారం రోజులుగా రాజస్థాన్ లో షికార్లు కొడుతున్నారు. బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం మహేష్ ఫ్యామిలీ ఈసారి రాజస్థాన్ జైపూర్ వెళ్లారు. ఆగష్టు 9 న మహేష్ బాబు బర్త్ డే. అక్కడే జైపూర్ లో మహేష్ బర్త్ డే సెలెబ్రేషన్న్ తర్వాత నమ్రత, సితార, గౌతమ్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి సందడి చేశారు.
రాజస్థాన్ లోని పలు ప్రదేశాల్లో సితార, గౌతమ్, నమ్రతలు కలితిరిగారు. మహేష్ మాత్రం రాజమౌళి సినిమా కోసం వర్కౌట్స్ అంటూ జిమ్ లో కుస్తీలు పడుతున్నారు. ఇక బర్త్ డే వేడుకల తర్వాత సూపర్ స్టార్ ఫ్యామిలీ హైదరాబాద్ కి పయనమైంది. నేడు జైపూర్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ మరియు నమ్రత, సితార, గౌతమ్ లు హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేందుకు వచ్చారు.
మహేష్ బాబు గెడ్డం, మీసం పెంచేసి కొత్తగా కనిపించారు. ఎప్పటిలాగే హెయిర్ ని క్యాప్ తో కవర్ చేసినా మహేష్ కొత్త లుక్ మాత్రం ఫ్యాన్స్ కి ఇంప్రెస్స్ చేస్తుంది.
మహేష్ ఫ్యామిలీ అండ్ మహేష్ కనిపిస్తే మీడియా ఊరుకుంటుందా మహేష్ ఇంకా సితార, నమ్రత, గౌతల్ లను క్లిక్ మనిపిస్తూ ఫోటో గ్రాఫర్స్ హడావిడికి చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.