గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబో లోక్రేజీ పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 27 న ఆడియన్స్ ముందుకు రాబోతున్న దేవర పార్ట్ 1 చిత్రం స్పీడ్ గా కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం ఒకటి రెండు సాంగ్స్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. రీసెంట్ గానే చుట్టమల్లే సాంగ్ విడుదలై రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది.
తాజాగా దేవర ఓపెనింగ్ సాంగ్ చిత్రీకరణలో టీమ్ మొత్తం తలమునకలై ఉన్న సమయంలో దేవర DOP రత్నవేలు దేవర ఓపెనింగ్ సాంగ్ పై క్రేజీ కామెంట్స్ చేసారు. అసలైన విజువల్ స్టైల్ తో అనిరుధ్ రవి చందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన దేవర నుండి కిక్ యాస్ ఓపెనింగ్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నాం.
ఈ పాటకు ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు మ్యూజిక్ లవర్స్ అంతా బ్రహ్మరథం పడతారు... అంటూ ఆ సాంగ్ షూట్ చెయ్యబోతున్న సెట్స్ నుండి తన ఫోటోను పంచుకున్నారు. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.