ఇప్పుడు ఈ సిట్యువేషన్ లో నాగ చైతన్య ప్లేస్ లో సమంత ఉండి ఉంటే.. ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చెయ్యకుండా ఉండేవారా.. తిట్టిన తిట్టుకుండా ఉండేవారా, సమంత నాగ చైతన్యకు విడాకులిచ్చాక ఒంటరిగా వ్యాధులు, విడాకుల వేదన భరిస్తూ ఆధ్యాత్మిక చింతనతో లైఫ్ లో ముందుకెళుతోంది. అలా కాకుండా సమంత మరో పెళ్ళికి సిద్దమై ఉంటే.. అహ ఒకవేళ ఉంటే..
అక్కినేని అభిమానులు ఊరుకునేవారా, సమంత ని సోషల్ మీడియా వేదికగా నానా మాటలనేసేవారే. ఆమెకి మరో పెళ్లి కావాల్సి వచ్చిందా అని మొహమాటం లేకుండా ట్రోల్ చేసేవారు. నిజంగా నాగ చైతన్య విడాకుల తర్వాత ఎంతగా నరకం చూసాడో రీసెంట్ గా నాగార్జున బయటపెట్టేవరకు ఎవ్వరికి తెలియదు. చైతు-సమంత విడాకుల విషయంలో చాలామంది సమంతనే తప్పుబట్టారు.
ఈరోజు నాగ చైతన్య పాత లైఫ్ నుంచి బయటపడి శోభిత దూళిపాళ్లను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ప్రేమ పెళ్లి, పెద్దల అంగీకారంతో చైతు జీవితంలో ముందుకెళ్ళిపోతున్నాడు. కానీ ఇదే పని సమంత చేస్తే అంటే ఆమె కూడా వేరొకరితో పెళ్ళికి సిద్దమయితే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కూడా కష్టమే.
సమంతను విమర్శిస్తూ ట్రోల్ చేసేవారు, నాగ చైతన్య కన్నా శోభితను సమంత ఫ్యాన్స్ తిడుతున్నా అది అంతగా ఎక్కడా హైలెట్ అవ్వడం లేదు. ప్రసుతం చై-శోభితాలు ఎంగేజ్మెంట్ చేసుకుని మరో రెండు నెలల్లో పెళ్ళికి రెడీ అవ్వబోతున్నారు. సమంత మాత్రం సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది.