Advertisementt

అప్పటినుంచే మొదలైన చైతు-శోభిత లవ్ స్టోరీ

Sun 11th Aug 2024 09:33 AM
samanta dhulipala  అప్పటినుంచే మొదలైన చైతు-శోభిత లవ్ స్టోరీ
Samanta Dhulipala reveals Naga Chaitanya-Shobitha love story అప్పటినుంచే మొదలైన చైతు-శోభిత లవ్ స్టోరీ
Advertisement
Ads by CJ

నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ప్రేమ వ్యవహారం ఇప్పటికి పెద్ద సస్పెన్స్ గానే ఉంది. వీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కలిసి నటించలేదు, ఫ్రెండ్స్ కూడా కాదు, ఏదైనా ఈవెంట్ లో కలిసారా అనేది కూడా క్లారిటీ లేదు. ఎలా వీరి మద్యన ప్రేమ సాధ్యమైంది, ఎప్పుడు వీరు కలిశారు.. ఎన్నేళ్ళుగా వీరి ప్రేమ వ్యవహారం నడుస్తుంది.. అనే విషయంలో అక్కినేని అభిమానుల్లో ఎన్నో రకాల ప్రశ్నలు. 

తాజాగా శోభిత సిస్టర్ సమంత దూళిపాళ్ల నాగ చైతన్య-శోభిత ల లవ్ స్టోరీని రివీల్ చేసింది. ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని బయటపెట్టింది. 2017 లో సమంత ని ప్రేమ పెళ్లి చేసుకున్న నాగ చైతన్య 2021 అక్టోబర్ లో విడాకులు తీసుకుని సపరేట్ అయిట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత చైతు డిప్రెషన్ తో నరక యాతన అనుభవించాడు అంటూ నాగార్జున రీసెంట్ గా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. 

అయితే శోభిత-చైతు లు 2022 నుంచి ప్రేమలో ఉన్నారు, 2022 నుంచే వారి మధ్యన ప్రేమ మొదలైంది అంటూ శోభిత సిస్టర్ సమంత చైతు-శోభిత ల ఎంగేజ్మెంట్ ఫొటోస్ షేర్ చేస్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది. అయితే నాగ చైతన్య 2022 లో శోభిత పోస్ట్ చేసిన ఓ పిక్ ని లైక్ కొట్టినట్టుగా ఇపుడు చెబుతున్నారు. అప్పుడే గమనించినట్లయితే వారి వ్యవహారం ఇన్నాళ్లు సీక్రెట్ గా ఉండేది కాదు.. ఏది ఏమైనా వీరి ఎంగేజ్మెంట్ ఇంకా సెన్సేషన్ గానే కనిపిస్తుంది. 

Samanta Dhulipala reveals Naga Chaitanya-Shobitha love story :

Naga Chaitanya and Sobhita Dhulipala are engaged!

Tags:   SAMANTA DHULIPALA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ