లిల్లీ ఉరఫ్ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరింది. బోల్డ్ కేరెక్టర్స్ తో హైలెట్ అవుతున్న అనుపమ పరమేశ్వరన్ తెలుగు, తమిళ, మలయాళ మూవీస్ తో ఫుల్ బిజీగా కనిపిస్తుంది. టిల్లు స్క్వేర్ తర్వాత అనుపమ క్రేజ్ బాగా పెరిగింది. ఆ సినిమాలో లిల్లీ గా అనుపమ యాక్టింగ్ మరియు అందాల విందుతో అధ్బతః అనిపించింది.
ఆ తర్వాత వరస ప్రాజెక్ట్స్ లో బిజీగా మారినప్పటికీ అనుపమ మాత్రం సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ అందాలు పరిచేస్తుంది. ఎటు చూసినా ట్రెడిషనల్ గా కనిపించే అనుపమ లిల్లీ కేరెక్టర్ తో తనలోని అన్ని యాంగిల్స్ పరిచయం చేసింది. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటో షూట్స్ తో మురిపిస్తుంది.
మోడ్రెన్ వేర్, శారీస్ ఇలా ఏదైనా గ్లామర్ మాత్రం కనిపించేలా ఆ ఫోటో షూట్స్ ఉంటున్నాయి. తాజాగా అనుపమ పరమేశ్వరన్ శారీ లుక్ వదిలింది. ఆ శారీ లో కొంగు చాటుగా అందాలు చూపించే ప్రయత్నంలో అనుపమ సక్సెస్ అయ్యింది. కొంగుచాటు అందాలతో సెల్ఫీ తీసుకుంటూ కనిపించిన అనుపమ పిక్స్ నెట్టింట సంచలనంగా మారాయి.