రాజమౌళి మహేష్ బర్త్ డే రోజున అభిమానులకు SSMB 29 నుంచి ట్రీట్ ఇస్తారు అని మహేష్ ఫ్యాన్స్ కొద్దిగా ఆశపడిన మాట వాస్తవం. కానీ మహేష్ బర్త్ డే ని రాజమౌళి పట్టించుకోలేదు, ఆయన అనుకున్న పని జరిగే వరకు తొందరపడరు. అభిమానుల కోసం ఏదో ఒకటి ఇచ్చే దర్శకుడు కాదాయన. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ డిజ్ పాయింట్ అయినా.. మున్ముందు వాళ్ళు తట్టుకోలేని సర్ ప్రైజ్ లు అందుతాయి.
ఇక మహేష్ కూడా తన బర్త్ డే రోజున ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ లో స్పెండ్ చేస్తూ అక్కడే బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకుని రాజమౌళి సినిమా కోసం పక్కాగా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే హెయిర్ మేకోవర్ కొత్తగా కనిపిస్తుండగా.. ఇప్పుడు జిమ్ లో బాడీ ట్రాన్ఫర్మేషన్ కోసం మహేష్ ఎంతగా కష్టపడుతున్నారో అనేది పై పిక్ చూస్తే తెలుస్తోంది.
బాడీ ఫిట్ నెస్ కోసం మహేష్ జిమ్ లో చమటలు చిందిస్తున్నాడు. ఇదంతా రాజమౌళి సినిమా కోసమే. కొత్త మేకోవర్ లోకి మహేష్ మారిపోతున్నాడు. మరి సెప్టెంబర్ లో రాజమౌళి-మహేష్ కాంబో కాన్సెప్ట్డి వీయోతోనే సినిమాపై రాజమౌళి స్పష్టతనిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.