నేచురల్ బ్యూటీ సాయి పల్లవి డ్రెస్సింగ్ స్టయిల్ కి మాత్రమే కాదు ఆమె నటనకు కూడా ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడు అంటే నమ్మాలి. ఆమె చేసింది తక్కువ సినిమాలే. అయినప్పటికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసిన ప్రతి చిత్రము కూడా సాయి పల్లవి ఇష్టపడి, కష్టపడి చేసింది. కమర్షియల్ సినిమాల ఆఫర్స్ ని సున్నితంగా తిరస్కరించి వార్తల్లో నిలుస్తుంది.
తాజాగా నాగ చైతన్యతో తండేల్ మూవీ తో పాటుగా తమిళ, మలయాళ సినిమాలతో ఈ బ్యూటీ ఫుల్ బిజీ. ఇక సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా ఉండని సాయి పల్లవి ఫొటోస్ కూడా ఎక్కడా మోడ్రెన్ గా కనిపించిన సందర్భమూ లేదు. ఎప్పుడు ట్రెడిషనల్ కి దగ్గరగా కనిపించే ఫొటోస్ మాత్రమే బయటికి వదులుతుంది.
సాయి పల్లవి చుడిదార్ ఫొటోస్ వదిలినా, లేదంటే చీరకట్టి స్టయిల్ చూపించినా అవి గ్లామర్ హీరోయిన్స్ ఫోటొలకన్నా స్పీడుగా వైరల్ అవుతాయి. తాజాగా సాయి పల్లవి చక్కటి చీరకట్టులో అద్భుతమైన ఫోజులతో మెస్మరైజ్ చేసింది.. ఆ పిక్స్ చూడగానే వావ్ సాయి పల్లవి ఎంత బాగుందో అని అనుకుండా ఉండలేరు.