పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలపై నీచమైన కామెంట్స్ చేసిన వైసీపీ ప్రముఖ నేతలంతా ఇప్పుడేమైపోయారో.. అసలు నిజంగా సీఎం హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడాడు. లాంటి జగన్ ఇప్పుడు తన ఎమ్యెల్సీ దువ్వాడ విషయంలో కామ్ అవడం తో అందరూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు గా పేరు తెచ్చుకున్న దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోడ్డెక్కింది. భార్య, పిల్లలను వదిలేసి మరో మహిళతో కలిసి ఉండడం మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. న్యాయం అడగడానికి వచ్చిన భార్య, కూతురుని దువ్వడ గత అర్ధరాత్రి మార్బుల్ పట్టుకుని చంపడానికి రావడం అది మీడియాలో వైరల్ కావడం జరిగిపోయింది.
దివ్వెల మాధురి అనే వైసీపీ మహిళా నేతతో దువ్వాడ అక్రమసంబంధం పెట్టుకున్నాడు అంటూ ఆయన భార్య పిల్లలు ఆరోపిస్తుంటే.. గత రెండిళ్లుగా తండ్రి గుర్తు రాలేదా, ఆయన్ని రోడ్డు మీద వదిలేస్తే నేను ఇంటికి తేచ్చుకున్నాను, దువ్వడ శ్రీను నాకు మంచి ఫ్రెండ్. నాకు పెళ్లి అయ్యి భర్త, పిల్లలు ఉన్నారు. అయినా ఎవరెవరు కలిసి ఉన్నారో అనేది అది వారి వ్యక్తిగత విషయం, ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా తప్పులేదంది.
దువ్వాడే నా సర్వస్వం, నేను చనిపోవాలనుకున్న సమయంలో దువ్వాడ శ్రీను నాకు అండగా నిలబడ్డారు, అసలు భర్తను వద్దనుకున్నదే వాణి. తనకు అసెంబ్లీ టికెట్ ఇస్తే చాలనుకుంది. భర్త కన్నా ఆమెకు అసెంబ్లీ సీటే ఎక్కువైంది, దువ్వాడ నాకు ఓ ఫ్రెండ్, ఫీలాసపర్.. ఇంకా అన్ని అంటూ దివ్వెల మాధురి మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది.
మరి ఇంత జరుగుతున్నా వైసీపీ నేతలు కానీ, జగన్ కానీ దువ్వాడ విషయంలో ఎలాంటి మాట మాట్లాడకపోవడం, చర్యలు తీసుకోకపోవడం చూసి ఇతర పార్టీ నేతలపై ఆరోపణలు చేసే మీరేనా నీతులు చెప్పేది అంటూ జగన్ ని వైసీపీ నేతలను నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.