సలార్ పార్ట్ 1 డిసెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. దానితో సలార్ 2 సౌర్యంగ పర్వ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రభాస్ కల్కి 2898 AD చిత్రంతో బిజీ అవడంతో సలార్ 2ని మే నుంచి స్టార్ట్ చేయాలనుకున్నారు. మే లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్ తో సలార్ సెట్స్ మీదకి వెళతారని అన్నారు.
అది జరగలేదు సరికదా ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ మూవీని మొదలు పెట్టేసారు. ఎన్టీఆర్ తో సినిమా తాజాగా ప్రశాంత్ నీల్ పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది.. ముందు సలార్ 2ని కంప్లీట్ చేశాకే ఎన్టీఆర్ మూవీపైకి ప్రశాంత్ నీల్ వెళతారని అన్నారు. కానీ అనూహ్యంగా ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ అయ్యింది.
దానితో సలార్ 2 విషయంలో ఏం జరుగుతుందో అర్ధం కాక ప్రభాస్ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. అయితే మధ్యలో ప్రశాంత్ నీల్ కి ప్రభాస్ కి ఏదో మనస్పర్థలు వచ్ఛాయని అన్నారు. అదే నిజమేమో. అందుకే ప్రశాంత్ నీల్ సలార్ 2ని పక్కనపెట్టేశారనుకుంటున్నారు. పక్కాగా డేట్ తో ఎన్టీఆర్ తో మూవీ ని మొదలు పెట్టారు. ఇక సలార్ 2 ఉండకపోవచ్చు అనే అనుమానాలు మొదలయ్యాయి.
మరోపక్క ప్రభాస్ వేరే కమిట్మెంట్స్ తోనే సలార్ 2 ఆలస్యమవుతుంది. అంతేకాని సలార్ 2 ఆగలేదు. ఖచ్చితంగా సాలర్ 2 ఉంటుంది అంటూ సర్దిచెప్పుకుంటున్నారు.