Advertisementt

చైతు-శోభిత లు ఆమె వల్ల విడిపోతారు

Fri 09th Aug 2024 05:44 PM
naga chaitanya  చైతు-శోభిత లు ఆమె వల్ల విడిపోతారు
Naga Chaitanya and Sobhita Dhulipala will separate in 2027 చైతు-శోభిత లు ఆమె వల్ల విడిపోతారు
Advertisement
Ads by CJ

నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల శుభమా అని ఎంగేజ్మెంట్ చేసుకుని జంట కాబోతున్న తరుణంలో ఒక లేడీ వల్ల వాళ్లు విడిపోతారంటూ చెప్పడం చూస్తే అతనెవరో పిచ్చివాడై ఉంటారు అనుకునేరు. కాదు కాదు చంద్రబాబు గెలిచి, జగన్ ఓడిపోతే తాను జాతకాలు చెప్పనని శపథం చేసి చంద్రబాబు గెలిచేసరికి జాతకులకు బై బై చెప్పిన వేణు స్వామి మళ్ళీ హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసేసాడు. 

నాగ చైతన్య-సమంత విషయంలో తాను చెప్పింది జరిగింది అని ఇప్పుడు జంట కాబోతున్న చైతు-శోభితల విషయంలోనూ తాను చెప్పింది జరుగుతుంది అనేలా వేణు స్వామి చెప్పిన జాతకం ఉంది. నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన, జాతకపరమైన విశ్లేషణ రేపు చేస్తాను అని నిన్న పోస్ట్ పెట్టిన వేణు స్వామి ఇప్పుడా జాతకంతో దిగిపోయాడు. 

ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న జంట నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల జాతకాలు కూడా కలవలేదు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నాక ఇబ్బందులు కచ్చితంగా వస్తాయి. పెళ్లి చేసుకున్న తర్వాత అంటే 2027 వరకు జాతకరీత్యా బాగానే ఉంటారు. కానీ ఆ తర్వాత వీళ్లిద్దరికీ మనస్పర్ధలు వస్తాయి, అది కూడా ఓ లేడీ వల్ల అంటూ షాకిచ్చేసాడు. 

నా అంచనా తప్పవ్వాలని కోరుకుంటున్నాను, నేను.. చైతన్య-శోభితలు ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముహుర్తం, పుట్టిన నక్షత్రం వివరాలు చూసిన తర్వాత చెబుతున్నాను. వారు ఏమాత్రం కలిసి ఉండలేరు, వారి మధ్యలో ఒక స్త్రీ వల్ల సమస్యలు, గొడవలు వస్తాయి. ఇవి వీళ్లిద్దరూ విడిపోడానికి దారి తీస్తాయి. అంటూ మరోసారి జాతకం మొదలు పెట్టిన వేణు స్వామిని అక్కినేని ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. ముందు నీ జాతకం ఎలా ఉందొ చూసుకో తర్వాత మా హీరో జాతకం చెబుదువుగాని అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

Naga Chaitanya and Sobhita Dhulipala will separate in 2027:

Naga Chaitanya and Sobhita Dhulipala will saperate in 2027, says astrologer Venu Swamy!

Tags:   NAGA CHAITANYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ