సమంతకి విడాకులిచ్చాక నాగ చైతన్య తన సినిమాలేవో తాను చేసుకుంటున్నాడు అనుకున్నారు. మధ్యలో శోభిత దూళిపాళ్ల తో డేటింగ్ రూమర్స్ వినిపించినా నాగ చైతన్య గుంభనంగానే ఉన్నాడు. ఎక్కడా బయటపడలేదు. సమంత మాత్రం ఆధ్యాత్మిక చింతనలో అలాగే మాయోసైటిస్ వ్యాధితో పోరాడుతూ కెరీర్ లో ముందుకు సాగుతుంది.
ఈలోపులో నాగ చైతన్య సైలెంట్ గా శోభిత దూళిపాళ్ల తో ప్రేమలో పడి ఆమెతో పెళ్ళికి సిద్దమయ్యాడు. తాజాగా చైతు ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ న్యూస్ బయటికి రాగానే సమంత ఎలా స్పందిస్తుందో అని అందరూ వెయిట్ చేస్తున్నారు.
కనీసం నాగ చైతన్య-శోభిత ల ఎంగేజ్మెంట్ పై సమంత ఇండైరెక్ట్ గా ట్వీట్ అయినా వేస్తుందా, లేదా అనే ఆత్రుత మాత్రం చాలామందిలో కనిపిస్తుంది. కానీ సమంత అభిమానులు నాగ చైతన్యపై కోపంగా ఉన్నారు.