Advertisement

బీజేపీకి ఎదురెళ్తున్న జగన్.. ఇందుకేనా?

Fri 09th Aug 2024 01:36 PM
jagan  బీజేపీకి ఎదురెళ్తున్న జగన్.. ఇందుకేనా?
Jagan is facing BJP.. is this why? బీజేపీకి ఎదురెళ్తున్న జగన్.. ఇందుకేనా?
Advertisement

బలవంతుడికి బలహీనుడు ఎదురెళ్తే ఏమవుతుందో తెలిసిందే కదా..! అలాంటిది కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన మోదీ సర్కార్‌ను వ్యతిరేకిస్తే.. మాట అస్సలు లెక్కే చేయకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..! సరిగ్గా ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదే చేస్తున్నారు..! దీంతో ఆయన భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. కార్యకర్తలు ఆందోళన చెందుతున్న పరిస్థితి..! ఎప్పుడేం జరుగుతుందో అని.. వైసీపీకి ఇక దిన దినగండమేనని సొంత మనుషులే చర్చించుకుంటున్న పరిస్థితి.! ఇంతకీ ఏం జరిగింది..? ఏ విషయంలో మోదీకి జగన్ ఎదురెళ్లారు..? అనేది ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం వచ్చేయండి..!

ఇదీ అసలు సంగతి..!

వైసీపీ-బీజేపీలు రెండూ నిన్న మొన్నటి వరకూ మింగిల్‌గానే ఉన్నాయి. ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. ఒక్కసారిగా విబేధాలు వచ్చినట్లుగా వైఎస్ జగన్ ప్రవర్తిస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు మొదలుకుని.. అధికారంలో ఉన్నా లేకున్నా బిల్లుల విషయంలో బీజేపీకి వైసీపీ సాయంగా ఉండేది కానీ.. సడన్‌గా ఎందుకు టోన్ మార్చేసి బిగ్ షాకిచ్చేసింది. లోక్ సభలో ఎన్డీయే సర్కార్ ప్రవేశ పెట్టిన వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లును జగన్ పార్టీ వ్యతిరేకించింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు టీడీపీ, జేడీయూ సహా ఎన్డీయే మిత్రపక్షాలు మద్దతు ప్రకటించగా.. విపక్షాలు మాత్రం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఫ్యాన్ పార్టీ ఎందుకిలా చేసింది..? ఎక్కడ తేడా కొట్టింది..? అనేది గల్లీ నుంచి ఢిల్లీ వరకూ రాజకీయంగా హాట్ టాపిక్‌ అయ్యింది.

ఎందుకిలా..?

2019 ఎన్నికల్లో మైనార్టీల ప్రాబల్యం ఉన్న చోటల్లా జెండా ఎగరేసిన వైసీపీ.. 2024లో మాత్రం ఒక్కచోటా గెలవలేదు. ఈ పరిస్థితుల్లో కూడా వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు మద్దతిస్తే సీన్ వేరేలా ఉంటుందని ముందుగానే గ్రహించిన వైసీపీ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో ముస్లింలను తమవైపు తిప్పుకునేందుకు ఇలా చేసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాయలసీమలోని 17 చోట్ల సహా 20 నియోజకవర్గాల్లో మైనార్టీలే గెలుపు ఓటములను నిర్ణయిస్తారు. వారిని మెప్పించడానికే ఈ బిల్లుపై ఎంఐఎం లేవనెత్తిన అభ్యంతరాలకు ఏకీభవిస్తూ వైసీపీ వ్యతిరేకించన్నది తాజాగా నడుస్తున్న చర్చ. దీనికి తోడు.. అపరకుబేరుడు ముఖేష్ అంబానీ ప్యాలెస్ యాంటిలియాను కాపాడేందుకు మోదీ వక్ఫ్ బోర్డు చట్టం తెస్తున్నారనే చర్చ సైతం ప్రజల్లో గట్టిగానే నడుస్తోంది. ఎందుకంటే.. ఆ ప్యాలెస్ యాంటిలియా నిర్మించిన స్థలం వక్ఫ్ బోర్డుకు చెందినది.. అందులో అనాథ శరణాలయాన్ని నిర్మించాలి, కానీ అంబానీ మోసపూరితంగా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు కోకొల్లలు.

ఇప్పుడే ఎందుకు..?

కేంద్ర ప్రభుత్వం రెండు దఫాలుగా తెచ్చిన ఏ బిల్లునూ వైసీపీ వ్యతిరేకించిన దాఖలాల్లేవ్. మరీ ముఖ్యంగా రైతు చట్టాలు, సీఏఏ (CAA), ఎన్నార్సీ (NRC) బిల్లులకు సైతం సపోర్టు చేసిన వైఎస్ జగన్.. ఈ ఒక్క వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లునే ఎందుకు వ్యతిరేకించారు..? అని అటు బీజేపీలో ఇటు ప్రతిపక్ష పార్టీల సభ్యుల్లో ఆలోచన మొదలైంది. ఇప్పుడు ఎలాగో ఎన్డీఏలో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఉండటంతో ఇక తాము అటుగా వెళ్లకూడదని, ఇకపై రాజకీయ నష్టపోకూడదని ఫిక్స్ అయ్యారట.. పైగా ఈ బిల్లును వ్యతిరేకిస్తే మైనార్టీల మనసులో చోటు సంపాదించుకోవచ్చన్నది జగన్ ప్లాన్ అయ్యుండొచ్చేమో..! మరోవైపు.. ఇండియా కూటమి దగ్గరవుతున్నారని అందుకే విపక్షాల బాటలోనే జగన్ నడుస్తున్నారనే అనుమానాలు పెద్ద ఎత్తునే వస్తున్నాయ్. ఢిల్లీలో వైసీపీ ధర్నాకు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ మొదలైన మైత్రి.. ఇక్కడ దాకా వచ్చిందన్న మాట. రేపు పొద్దున్న ఎక్కడకెళ్లి ఆగుతుందో.. ఇక ఇంత జరిగిన తర్వాత మోదీ ఊరుకుంటారా..? ఏం జరుగుతుందో చూడాలి మరి.

Jagan is facing BJP.. is this why?:

Jagan vs BJP 

Tags:   JAGAN
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement