నేడు (ఆగస్ట్ 9) సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా అభిమానులు అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూనే, మరోవైపు సోషల్ మీడియా ని హోరెత్తిస్తున్నారు. అలాగే మహేష్ పుట్టినరోజు కానుకగా రీ రిలీజ్ అయిన మురారి 4K థియేటర్స్ అన్నీ హౌస్ ఫుల్ బోర్డులు తగిలించుకుని బ్యానర్లతో, బాణాసంచా మెరుపులతో కళకళలాడుతున్నాయి. ఇక మహేష్ కి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షల గురించి అయితే చెప్పక్కర్లేదు. అన్ని ఫ్లాట్ ఫామ్స్ లోనూ ఫ్యాన్సే కాకుండా ఎంతోమంది సెలెబ్రిటీలు, నిర్మాణ సంస్థలు బర్త్ డే విషెస్ పోస్టులతో మహేష్ పై అభిమానాన్ని చాటుకుంటున్నారు.
సూపర్ స్టార్ కి రౌడీ స్టార్ రిక్వెస్ట్
మహేష్ బాబు ని గ్రీట్ చేస్తోన్న పోస్టులలో విజయ్ దేవరకొండ పోస్ట్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే తాను మహేష్ ఫ్యాన్ అని కెరీర్ బిగినింగ్ లోనే ఓపెన్ గా చెప్పేసిన విజయ్ దేవరకొండ ఆపై తనకంటూ స్టార్ డమ్ వచ్చినప్పటికీ ఆ ఫ్యాన్ బోయ్ యాంగిల్ మాత్రం అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. నేడు తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా మహేష్ కి బర్త్ డే విషెస్ చెబుతూ మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మమ్మల్ని మరీ ఎక్కువ కాలం వెయిట్ చేయించొద్దు అనడం ఆ పోస్ట్ కి సూపర్ ఫాన్స్ ని స్ట్రాంగ్ గా కనెక్ట్ చేసేసింది. మా కోరిక కూడా అదే అన్నా అంటూ విజయ్ వ్యాఖ్యకు తమ రిప్లైస్ తో స్ట్రెంగ్త్ పెంచేశారు ఫాన్స్. మరీ రౌడీ స్టార్ రిక్వెస్ట్ కి సూపర్ స్టార్ ఎలా స్పందిస్తారో చూద్దాం !
అందరిదీ అదే థాట్.. అందరికీ ఒకే డౌట్
సూపర్ స్టార్ మహేష్ తదుపరి చిత్రం దర్శక బాహుబలి రాజమౌళితో అనే విషయం తెలిసిందే. అత్యంత భారీగా అంతర్జాతీయ హంగులతో రూపొందించనున్న ఆ గ్లోబ్ ట్రోటింగ్ ఫిలిం కోసం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు రాజమౌళి. మహేష్ అయితే గత ఎనిమిది నెలలుగా హెయిర్ పెంచుతూ, ఫిజిక్ ని ప్రోపర్ గా షేప్ అప్ చేస్తూ రాజమౌళి సూచించిన మేకోవర్ వర్క్ లో ఉన్నారు. కానీ అభిమానుల్లో మాత్రం మళ్ళీ మహేష్ ని వెండితెరపై చూసేది ఎప్పుడో అనే ఆరాటం పెరిగిపోతోంది. ఫిల్మ్ మేకింగ్ లో జక్కన్న చెక్కుడు లోక విదితమే కనుక అందరిదీ అదే థాట్.. అందరికీ ఒకే డౌట్. ఎప్పటికి పూర్తవుతుందో.. ఎప్పుడు మన ముందుకు వస్తుందో అని. కచ్చితంగా ఆ సినిమా అద్భుతమే అనే అంచనా అందరిలోనూ ఉంది. అయితే ఆ అద్భుతాన్ని వీలైనంత త్వరగా తెరపైకి తెచ్చేస్తే మళ్ళీ మళ్ళీ మహేష్ ని తనివి తీరా చూసుకోవాలనే ఆత్రుత ఆకాశమంత పెరిగిపోతోంది.
అందుకే వీలైనంత త్వరగా వచ్చేయ్ బాబు.
హాలీవుడ్ రేంజ్ లో చేసేయ్ రుబాబు !!
Happy Birthday Mahesh Babu