Advertisementt

నయని పావనికి మరో అవకాశం

Fri 09th Aug 2024 11:08 AM
nayani pavani  నయని పావనికి మరో అవకాశం
Another chance for Nayani Pavani నయని పావనికి మరో అవకాశం
Advertisement
Ads by CJ

ఈమధ్యన బుల్లితెరను ఫాలో అయ్యేవాళ్ళకు నయని పావని అంటే ఎవరో తెలియకుండా ఉండదు. యూట్యూబ్ లో సుపరిచితురాలు నయని పావని. ఈ అమ్మాయి గత బిగ్ బాస్ సీజన్ లో మధ్యలో వచ్చి ఒక్క వారం లోనే ఆ అమ్మాయి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. ఆ వారంలోనే బిగ్ బాస్ ప్రేక్షకుల మనసు దోచేసింది. శివాజీ కి కూతురు ప్రేమను పంచింది.

ఆ తర్వాత నీతోనే డాన్స్ లోను డాన్స్ స్టెప్స్ తో మైమరిపించింది. అయితే అప్పట్లో బిగ్ బాస్ కి వెళ్లి వారంలోనే తిరిగొచ్చిన నయని పావనికి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లో మరో అవకాశం దక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సీజన్ లో నయని పావనికి అవకాశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు

మరి అప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 లో నయని ఆటని మిస్ అయినవారు ఈ సీజన్ 8 లో మిస్ కావొద్దు అంటూ నయని అభిమానులు అడుగుతున్నారు. నిజంగానే నయని పావని బిగ్ బాస్ సీజన్ 8 లో సందడి చెయ్యబోతుందో లేదో అనేది త్వరలోనే తేలిపోతుంది. 

Another chance for Nayani Pavani:

Nayani Pavani entered Bigg Boss 8

Tags:   NAYANI PAVANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ