హీరో రాజ్ తరుణ్ అరెస్ట్ అవ్వకుండా కోర్టు తీర్పునిచ్చింది. కాదు కాదు బెయిల్ మంజూరు చేసింది. లావణ్య ని మోసం చేసాడనే అభియోగంలో ఇరుక్కున్న రాజ్ తరుణ్ ఆ కేసులో అరెస్ట్ అవుతాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. లావణ్య రాజ్ తరుణ్ పై పకడ్బందీగా కేసు పెట్టడంతో రాజ్ తరుణ్ ని పోలీసులు అరెస్ట్ చెయ్యబోతున్నారని అన్నారు. దానితో రాజ్ తరుణ్ హై కోర్టుని ఆశ్రయించాడు.
తనకు ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ వెయ్యడంతో హై కోర్టు రాజ్ తరుణ్ కి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లావణ్య ని కూడా కోర్టు రాజ్ తరుణ్ తో మీకు పెళ్లయిందా, అయితే ఆధారాలున్నాయా అని అడగగా.. ఆధారాలు లేవని చెప్పడం, లావణ్య తరుపు లాయర్ దిలీప్ కుమార్ తమకు ఆధారాలు సమర్పించేందుకు సమయం కావాలని అడగడంతో కోర్టు ఒప్పుకోలేదు.
రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకున్నాడు అని, ఆ తర్వాత తనకి అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించినట్టుగా ఆధారాలు లావణ్య కోర్టుకి సమర్పించకపోవడంతో కోర్టు రాజ్ తరుణ్ కి బెయిల్ మంజురు చెయ్యడంతో ఈ కేసు నుంచి రాజ్ తరుణ్ కాస్త ఊపిరి పీల్చుకుని రిలాక్స్ అయ్యాడు.