Advertisementt

ఎన్టీఆర్-నీల్ ముహూర్తం, వేదిక ఫిక్స్

Thu 08th Aug 2024 03:03 PM
ntr  ఎన్టీఆర్-నీల్ ముహూర్తం, వేదిక ఫిక్స్
NTR-Neel combo muhurtham and venue fix ఎన్టీఆర్-నీల్ ముహూర్తం, వేదిక ఫిక్స్
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబో NTR31 ముహూర్తం ముంచుకొస్తుంది. రేపు మొదటి శ్రావణ శుక్రవారం ఆగష్టు 9 న నీల్-ఎన్టీఆర్ మూవీకి ముహూర్తం పెట్టారు. అది కూడా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో మైత్రి మూవీ మేకర్స్ వారు ఎన్టీఆర్-నీల్ మూవీని అంగరంగ వైభవంగా మొదలు పెట్టబోతున్నారు. 

అయితే ఈ మూవీ ఓపెనింగ్ కి మీడియాకి అనుమతి లేదు అని తెలుస్తోంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్ కాన్ఫిడెన్షియల్ అని, తర్వాత మేకర్స్ ఫొటోస్ వదులుతారని అంటున్నారు. రేపు ఉదయం ఈ మూవీ ఓపెనింగ్ ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. 

ఎన్టీఆర్-నీల్ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ కాంబో సెట్స్ మీదకి వెళుతుందా అని వారు ఎదురు చూడని క్షణం లేదు. ఆ ఆతృతకు ఫైనల్ గా రేపు శుభం కార్డు పడబోతోంది. 

NTR-Neel combo muhurtham and venue fix:

NTR and Prashanth Neel Movie Muhurtham Fix 

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ