Advertisementt

నాగార్జునే కన్ ఫర్మ్ చేసారు: చైతు-శోభిత పెళ్లి

Thu 08th Aug 2024 01:43 PM
nagarjuna  నాగార్జునే కన్ ఫర్మ్ చేసారు: చైతు-శోభిత పెళ్లి
Official: Naga Chaitanya, Shobhita Dhulipala gets engaged నాగార్జునే కన్ ఫర్మ్ చేసారు: చైతు-శోభిత పెళ్లి
Advertisement
Ads by CJ

నాగ చైతన్య-హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ వార్తలు ఇంకా చాలామంది నమ్మలేకపొతున్నారు. నాగ చైతన్య సమంత తో విడాకుల తర్వాత కొద్దిరోజులు కామ్ గా ఉండి ఆ తర్వాత హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో డేటింగ్ మొదలు పెట్టడంటూ మీడియా కోడై కూసింది. కానీ చైతు-శోభితల సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. 

నేడు గురువారం చైతు-శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారనే వార్త ఒక్కసారిగా మీడియాలో వైరల్ గా మారిపోయింది. కానీ చాలామంది ఆ ఎంగేజ్మెంట్ విషయాన్ని నమ్మలేకపోతున్న తరుణంలో కింగ్ నాగార్జున తన పెద్దకొడుకు నాగ చైతన్య-శోభితల ఎంగేజ్మెంట్ విషయమై అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. 

నాగార్జున తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి చైతు-శోభితల ఎంగేజ్మెంట్ పిక్ షేర్ చేస్తూ.. ఈ రోజు ఉదయం 9:42 గంటలకు జరిగిన మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది!!

ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము.

సంతోషకరమైన జంటకు అభినందనలు! 

వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. 💐

దేవుడు ఆశీర్వదిస్తాడు!❤️

8.8.8 

అనంతమైన ప్రేమకు నాంది❤️

శోభితాద్

ఛాయక్కినేని

@chay_akkineni అంటూ నాగార్జున అధికారికంగా నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల పెళ్లిని ప్రకటించారు. 

Official: Naga Chaitanya, Shobhita Dhulipala gets engaged:

Nagarjuna shares Naga Chaitanya, Shobhita Dhulipala engagement snaps

Tags:   NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ