Advertisementt

ముగిసిన చైతు-శోభితల నిశ్చితార్ధం

Thu 08th Aug 2024 12:17 PM
naga chaitanya  ముగిసిన చైతు-శోభితల నిశ్చితార్ధం
Chaitu-Shobhita engagement ended ముగిసిన చైతు-శోభితల నిశ్చితార్ధం
Advertisement
Ads by CJ

నిజంగా అందరికి షాకిచ్చే విషయమే, అక్కినేని అభిమానులైతే షాకింగ్ తో పాటుగా సర్ ప్రైజ్ కూడా అవుతున్నారు. కారణం నాగ చైతన్య తన లైఫ్ లో ముందుకెళ్లడానికి రెడీ అయ్యాడు. సమంత తో విడాకుల తర్వాత శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ ని నిజం చేస్తూ నాగ చైతన్య నేడు శోభిత తో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  

నాగ చైతన్య ఇష్టపడి కొనుక్కున్న ప్లాట్ లోనే చైతు-శోభితల నిశ్చితార్ధాన్ని చాలా సింపుల్ గా ఇరు కుటుంబాల వారు జరిపించేశారని, కొన్ని కారణాల వలన నాగ చైతన్య ఇంటి దరిదాపులకు కూడా మీడియాని అనుమతించలేదు అని తెలుస్తుంది. నాగ చైతన్య తల్లి లక్ష్మి, దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, శోభిత కుటుంబ సభ్యుల మద్యన చైతు-శోభితల నిశ్సితార్ధం సింపుల్ గా జరిగిపోయినట్టుగా తెలుస్తుంది. 

సంప్రదాయంగా జరిగిన ఈ నిశ్చితార్థంలో నాగ చైతన్య శోభిత వేలుకి ఉంగరం తొడిగాడని అంటున్నారు. త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసి ప్రకటిస్తారని సమాచారం.

Chaitu-Shobhita engagement ended:

 Naga Chaitanya - Sobhita engagement on cards

Tags:   NAGA CHAITANYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ